Nag Ashwin -Elon Musk : బాబు ఎలాన్ మస్క్.. వచ్చి మా ‘బుజ్జి’ని డ్రైవ్ చెయ్యి.. మస్క్‌కు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి..

తాజాగా కల్కి సినిమాకు, ఈ వెహికల్ కి మరింత హైప్ తీసుకురావడానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్ కి ట్వీట్ చేసాడు.

Nag Ashwin -Elon Musk : బాబు ఎలాన్ మస్క్.. వచ్చి మా ‘బుజ్జి’ని డ్రైవ్ చెయ్యి.. మస్క్‌కు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి..

Nag Ashwin Tweet to Elon Musk and Request for Driving Kalki Bujji Vehicle

Updated On : May 29, 2024 / 6:53 AM IST

Nag Ashwin -Elon Musk : ప్రభాస్(Prabhas) కల్కి(Kalki) సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ బుజ్జిని ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి లాంచ్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మహేంద్ర కంపెనీతో కలిసి కల్కి మూవీ టీమ్ ఈ బుజ్జి వెహికల్ ని తయారుచేసింది. సరికొత్తగా ఉన్న ఈ వెహికల్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక కల్కి సినిమాలో నటించిన వాళ్ళతో కాకుండా ఈ బుజ్జి వెహికల్ తో సినిమా ప్రమోషన్స్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ వెహికల్ ని దేశంలోని పలు నగరాల్లో తిప్పుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాలో ఈ వెహికల్ తో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. తాజాగా సినిమాకు, ఈ వెహికల్ కి మరింత హైప్ తీసుకురావడానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్ కి ట్వీట్ చేసాడు.

Also Read : Vishwak Sen : షూటింగ్ లో లారీ మీద నుంచి పడిపోయా.. మోకాలికి దెబ్బ.. బాలయ్య ఫోన్ చేసి..

నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్ ని ట్యాగ్ చేస్తూ తన ట్వీట్ లో.. ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని చూడటానికి, నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువున్న ఒక వాహనం. ఫుల్ ఎలెక్ట్రిక్ వెహికల్, ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది మీకు ఒక గొప్ప అనుభూతి ఇస్తుందని చెప్పగలను అని ట్వీట్ చేసారు. మరి ఎలాన్ మస్క్ నాగ్ అశ్విన్ ట్వీట్ కి స్పందించి బుజ్జి ని డ్రైవ్ చేయడానికి ఇండియా వస్తాడా చూడాలి.