Naga Chaitanya And Sai Pallavi Might Come To Bigg Boss 5 This Weekend On Part Of Love Story Promotions
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 లో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇతర సీజన్లలో ఇప్పటికే పలువురు స్టార్స్ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోకి వచ్చి సందడి చేశారు. ఇప్పుడు యువసామ్రాట్ నాగ చైతన్య, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఈ షోకి రాబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..
అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి.. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ద్వారానే సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు.
Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..
సెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకే ప్రమోషన్స్ స్పీడప్ చేశారు టీం. ఈ నేపథ్యంలో చైతు, సాయి పల్లవి కలిసి నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 5 లో పాల్గొనబోతున్నారట. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో ఆన్ స్క్రీన్ జోడీ సందడి చెయ్యబోతున్నారు.
Samantha : ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌పై సమంత రియాక్షన్.. డిఫరెన్స్ గమనించారా..?