Aamir Khan : ఆమిర్ ఖాన్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో.. బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో నాగచైతన్య..

ఆమిర్ ఖాన్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో నాగచైతన్య సందడి. వైరల్ అవుతున్న వీడియోలు..

Naga Chaitanya at Aamir Khan daughter wedding reception with bollywood celebrities

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్.. తాను ప్రేమించిన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేని జనవరి 3న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు రిజిస్టర్ పద్దతిలో సింపుల్ గా జరిగిన వివాహం.. ఆ తరువాత ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి ప్రమాణాలతో మరోసారి గ్రాండ్ గా వెడ్డింగ్ జరిగింది. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన రిసెప్షన్స్ కూడా రెండుసార్లు జరుగుతున్నాయి.

తాజాగా ముంబైలో సినీ సెలబ్రిటీస్ కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యి కొత్త జంటకి విషెస్ తెలియజేశారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అనిల్ కపూర్, కత్రినా, కంగనాతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బిజినెస్ దిగ్గజం అంబానీ దంపతులు కూడా హాజరయ్యారు. ఈ అందరి బాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య కూడా సందడి చేశారు.

Also read : Mega Family : మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూశారా..? కొత్త కోడలి సున్నుండలు తయారీ..

నాగచైతన్య, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమిర్ అండ్ ఫ్యామిలీతో చైతన్యకి మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహంతోనే ఐరా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. రిసెప్షన్ లో చైతన్య, ఐరా ఖాన్ స్నేహంగా మాట్లాడుకుంటున్న వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే అనిల్ కపూర్ తో చైతన్య వీడియో కూడా వైరల్ అవుతుంది.

ఇక బాలీవుడ్ ఖాన్‌త్రయం ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒక ఈవెంట్ లో కనిపించడంతో బాలీవుడ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

కాగా ఐరా ఖాన్, నూపుర్ శిఖరే నిశ్చితార్థం 2022 నవంబర్ 18న జరిగింది. ఐరా ఖాన్ ఆమిర్ మొదటి భార్య కుమార్తె. ఆమిర్ ఖాన్ 1986లో ‘రీనా దత్తా’ అనే మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 2002లో విడాకులతో విడిపోయారు. వీరిద్దరికి పుట్టిన కూతురే ఐరా ఖాన్. అలాగే ఈ జంటకి ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చారు.