Naga Chaitanya Planning For Another Clean Hit With This Director
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ రిలీజ్‌కు రెడీ కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా, పూర్తి పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాలో చైతూ ఓ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
Naga Chaitanya : ఆ విషయంలో మా నాన్న తప్పేమి లేదు.. నాగార్జున పై నాగచైతన్య కామెంట్స్!
ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చైతూ, తన నెక్ట్స్ మూవీపై కూడా అప్పుడే ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీతో మరోసారి బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. గతంలో తనకు మజిలీ వంటి సూపర్ హిట్ అందించిన దర్శుకుడు శివ నిర్వాణతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు చైతూ రెడీ అయ్యాడట. ఇప్పటికే చైతూకి శివ ఓ కథను వినిపించాడని.. త్వరలోనే ఈ ప్రాజెక్టును అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేస్తారని తెలుస్తోంది.
Naga Chaitanya: ఆ డైరెక్టర్ వల్ల టైమ్ వేస్ట్ అంటోన్న చైతూ.. ఎవరో తెలుసా?
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో ‘ఖుషి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శివ నిర్వాణ నిజంగానే చైతూతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా చైతూ కెరీర్‌లో క్లీన్ హిట్ ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.