Naga Chaitanya Sai Pallavi Thandel Movie Interesting Facts
Thandel : నాగచైతన్య -సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో భారీగా ఈ సినిమాని తెరకెక్కించారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు చాలా కష్టాలు పడ్డారు, భారీ బడ్జెట్ పెట్టారు, రియల్ కథతో తీశారు.. ఇలా బోలెడన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
# తండేల్ సినిమా గుజరాత్ పోర్ట్ కి ఫిషింగ్ కి వెళ్లిన తెలుగు వాళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి అరెస్ట్ అయి ఎలా బయటపడ్డారు అని మత్స్యకారుల రియల్ కథ.
# ఈ కథకు రాజు – సత్య అనే ఫిక్షనల్ లవ్ స్టోరీ జోడించి చెప్పారు.
# తండేల్ అనేది గుజరాతి పదం. తండేల్ అంటే లీడర్ అని అర్ధం.
# ఒక్క తుఫాను ఎపిసోడ్ తప్ప మిగిలిన సముద్రంపై ఉండే సీన్స్ అన్ని రియల్ గా సముద్రంలోనే షూట్ చేసారు.
# కేవలం సముద్రం మీద షూటింగ్ ఆల్మోస్ట్ 30 రోజులు చేసారు.
# గ్రాఫిక్ వర్క్స్ కూడా ఈ సినిమాకు చాలానే ఉన్నాయి.
# ఈ సినిమాని కేరళ, మంగళూరు, గోవా, వైజాగ్, శ్రీకాకుళం.. ఇలా చాలా అవుట్ డోర్ లొకేషన్స్ లో షూట్ చేసారు.
# సినిమా మత్స్యకారుల జీవనం నేపథ్యంలో తీయడం, చాలా మంది లైవ్ పాత్రల రిఫరెన్స్ ఉండటం, కొంతమంది పొలిటీషియన్స్ ని చూపించడంతో సినిమా సెన్సార్ కోసం చాలా మంది దగ్గర పర్మిషన్ లెటర్స్ తీసుకురావాల్సి వచ్చింది.
# నాగచైతన్య మొదటిసారి డీ గ్లామరైజ్ లుక్ లో కనిపించారు ఈ సినిమా కోసం. ఈ సినిమా లుక్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసి మారాడు చైతూ.
Also Read : Mohan Babu : నా ఆస్తిపై ఎవరికీ అధికారం లేదు.. మనోజ్ తిరిగివ్వాల్సిందే.. మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు…
# సినిమాలో పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ మొత్తం 20 నిముషాలు ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే ప్రకారం అక్కడక్కడా చూపిస్తారు.
# ఇంటర్నెట్ లో పాకిస్థాన్, అక్కడి జైల్స్ ఎలా ఉంటాయి అని బాగా పరిశీలించి హైదరాబాద్ లోనే పాకిస్థాన్ జైలు భారీ సెట్ వేశారు.
# మంగళూరు సముద్రం దగ్గర ఒక ఊరు సెట్ వేశారు ఈ సినిమా కోసం.
# సినిమాలో రెండు ఫైట్స్ మాత్రమే ఉన్నాయట.
# సముద్రంలో, ఇసుకలో ఎండలో సీన్స్ కోసం నాగచైతన్య, సాయి పల్లవి బాగా కష్టపడ్డారు.
# సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ తండేల్ సినిమాకు 90 కోట్ల బడ్జెట్ వరకు పెట్టారట.
# నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ఇది.
# గ్రాఫిక్ వర్క్స్ వల్ల కూడా సినిమా ఆలస్యం అయింది.
# సినిమాని సీడెడ్ తప్ప మిగిలిన అన్ని ఏరియాలలో గీత్ ఆర్ట్స్ సొంతంగా రిస్క్ చేసి రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఆల్రెడీ అమ్ముడయ్యాయి.