Naga Chaitanya To Launch Allari Naresh Ugram Movie Teaser
Allari Naresh: యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల సీరియస్ మూవీల్లో నటిస్తూ వాటిని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా మలచడంలో సక్సెస్ అవుతున్నాడు. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో, ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.
Allari Naresh: రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’!
కాగా, ప్రస్తుతం మరో వైవిధ్యమైన సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. ‘నాంది’ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో మరోసారి పవర్‌ఫుల్ మూవీతో మనముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు ‘ఉగ్రం’ అనే టైటిల్‌ను గతంలోనే ఫిక్స్ చేయగా, ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Allari Naresh: స్టార్ హీరో సినిమాలో నరేశ్.. అల్లరి చేస్తాడా.. ఏడిపిస్తాడా..?
ఉగ్రం చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు ఏఎంబి సినిమాస్‌లో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతులుమీదుగా లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మిర్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.