Allari Naresh: స్టార్ హీరో సినిమాలో నరేశ్.. అల్లరి చేస్తాడా.. ఏడిపిస్తాడా..?
టాలీవుడ్ కామెడీ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన అల్లరి నరేశ్, ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కామెడీతో సినిమాలు చేస్తుండటంతో ఈ హీరోకు కూడా ఫెయిల్యూర్ ఎదురయ్యింది. దీంతో అల్లరి నేరేశ్ సినిమాల సంఖ్య చాలా తక్కువయ్యింది. అయితే ఈ క్రమంలో నరేశ్ కామెడీ సినిమాలను పక్కనబెట్టి, సీరియస్ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలోనూ మెప్పించాడు ఈ యాక్టర్.

Allari Naresh To Star In Akkineni Nagarjuna Movie
Allari Naresh: టాలీవుడ్ కామెడీ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన అల్లరి నరేశ్, ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కామెడీతో సినిమాలు చేస్తుండటంతో ఈ హీరోకు కూడా ఫెయిల్యూర్ ఎదురయ్యింది. దీంతో అల్లరి నేరేశ్ సినిమాల సంఖ్య చాలా తక్కువయ్యింది. అయితే ఈ క్రమంలో నరేశ్ కామెడీ సినిమాలను పక్కనబెట్టి, సీరియస్ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలోనూ మెప్పించాడు ఈ యాక్టర్.
Allari naresh : పవన్ కళ్యాణ్ పార్టీపై, రాజకీయాలపై స్పందించిన నరేష్..
ఇక నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాల్లో సీరియస్ పాత్రల్లో నటించి మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ నటించేందుకు రెడీ అవుతున్నాడట. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించబోయే నెక్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్రలో అల్లరి నరేశ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగ్ ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే.
Allari Naresh : ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.. కానీ..
ఈ సినిమాలో అల్లరి నరేశ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కూడా చాలా సీరియస్‌గా ఉంటుందని, సినిమా కథలో ఇది చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే అల్లరి నరేశ్ కోసం ప్రసన్న కుమార్ ఎలాంటి పాత్రను రెడీ చేశాడా.. ఈ సినిమాలో నాగ్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.