Naga Chaitanya : ఫ్యాన్స్‌తో క‌లిసి తాత‌గారి క్లాసిక్ మూవీ చూసిన హీరో నాగ‌చైత‌న్య‌

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు.

Naga chaitanya watch Akkineni Nageswara Rao Devadas movie with fans

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హైదరబాద్‌లో ‘దేవదాసు’ 4K స్క్రీనింగ్ ప్రారంభ‌మైంది. 31 సిటీస్ లో ఏఎన్ఆర్‌ 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.

ఈ ఫెస్టివల్ లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ (1971) చిత్రాన్ని శాంతి థియేటర్‌లో ఫ్యాన్స్‌తో క‌లిసి చూశారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ల‌లో పండగ వాతావరణం నెలకొంది.

Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అత‌డేనా?

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘దేవదాసు’ (1953), ‘మిస్సమ్మ’ (1955) ‘మాయాబజార్’ (1957), ‘భార్య భర్తలు’ (1961), ‘గుండమ్మ కథ’ (1962), ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘సుడిగుండాలు’ (1968), ‘ప్రేమ్ నగర్’ (1971), ‘ప్రేమాభిషేకం’ (1981) ‘మనం’ (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు.