Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అత‌డేనా?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 మూడో వారం పూర్తి కావొచ్చింది.

Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అత‌డేనా?

Bigg Boss 8 Telugu 3rd week elimination

Updated On : September 22, 2024 / 3:49 PM IST

Big Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 మూడో వారం పూర్తి కావొచ్చింది. 14 మందితో షో ప్రారంభం కాగా.. ఇప్ప‌టికే ఇద్ద‌రు బేబ‌క్క‌, శేఖ‌ర్ బాషాలు ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం హౌస్‌లో 12 మంది ఉన్నారు. ఇక మూడో వారం నామినేష‌న్స్‌లో 8 మంది సీత, ప్రేరణ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, యష్మీ, విష్ణుప్రియ, నైనిక, అభయ్ లు ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారు అనే క్యూరియాసిటీగా మారింది.

ఈ వారం ఊహించ‌ని కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. నామినేష‌న్స్‌లో ఉన్న ఎనిమిది మందిలో విష్ణు ప్రియ‌కు పెద్ద సంఖ్య‌లో ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. నాగ‌మ‌ణికంఠ‌, ప్రేర‌ణ‌, సీత‌, య‌ష్మీల‌కు సైతం మంచి ఓటింగ్ ప‌డ‌డంతో వారంతా సేఫ్‌లో ఉన్నార‌ట‌. ఇక డేంజ‌ర్ జోన్‌లో నైనిక‌, అభ‌య్‌, పృథ్వీరాజ్ ఉన్నార‌ట‌.

Devara New Trailer : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలే..

ఈ ముగ్గురిలో అభయ్ ఎలిమినేట్ కాబోతున్నాడని టాక్‌. అత‌డు ఏకంగా బిగ్‌బాస్‌నే తిట్టేశాడు. అంతేకాకుండా చీఫ్‌గా త‌న బాధ్య‌త‌లను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేదు. టాస్కుల్లోనూ పెద్ద‌గా యాక్టివ్‌గా లేడు. అందుక‌నే శ‌నివారం ఎపిసోడ్‌లో కూడా నాగార్జున అత‌డికి రెడ్ కార్డు ఇచ్చాడు.

అయితే.. హౌస్‌మేట్స్ అంతా రిక్వెస్ట్ చేయ‌డంతో అత‌డిని బ‌య‌ట‌కు పంపంచ‌లేదు. కానీ ఆదివారం ఎలిమినేష‌న్ అయింది అత‌డే అని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రి నిజంగా అత‌డే ఎలిమినేట్ అయ్యాడా? లేదో ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యాకే క్లారిటీ రానుంది.

Nikhil Siddhartha : తిరుమ‌ల ల‌డ్డూ వివాదం.. హీరో నిఖిల్ ట్వీట్‌.. ఏకంగా ప్ర‌ధానిని ట్యాగ్ చేస్తూ..