Nikhil Siddhartha : తిరుమ‌ల ల‌డ్డూ వివాదం.. హీరో నిఖిల్ ట్వీట్‌.. ఏకంగా ప్ర‌ధానిని ట్యాగ్ చేస్తూ..

తిరుమల తిరుపతి ల‌డ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ స్పందించారు.

Nikhil Siddhartha : తిరుమ‌ల ల‌డ్డూ వివాదం.. హీరో నిఖిల్ ట్వీట్‌.. ఏకంగా ప్ర‌ధానిని ట్యాగ్ చేస్తూ..

Nikhil Siddhartha Comments On Ttd Laddu Row

Updated On : September 22, 2024 / 11:46 AM IST

తిరుమల తిరుపతి ల‌డ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ స్పందించారు. గ‌త కొన్నేళ్లుగా ఇలా జ‌రిగింద‌ని తెలిసి షాక్ అయిన‌ట్లు చెప్పాడు. ఇది ఏ ఒక్క‌రికో జ‌రిగింది కాద‌ని, ప్ర‌తి భార‌తీయుడి విశ్వాసానికి జ‌రిగిన అవ‌మానం అని అన్నారు.

ఇలాంటి ప‌నిని చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అమిత్‌షాలను కోరారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆయ‌న పోస్ట్ చేశాడు.

RGV Saree Song : ఆర్జీవీ ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసిందిగా.. హాట్ విజువల్స్‌తో ఆర్జీవీ మార్క్..

“గ‌త కొన్నేళ్లుగా తిరుమ‌ల తిరుప‌తి ప్ర‌సాదంలో టాంప‌రింగ్ జ‌రిగింద‌ని తెలిసి షాక్ అయ్యా. ఇది ఏ ఒక్కరికో కాదు. ప్రతి భారతీయుడి విశ్వాసానికి జరిగిన అవమానం. ఈ పని చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి. దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి.” అని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అమిత్‌షాలను నిఖిల్‌ ట్యాగ్ చేశారు.