Devara New Trailer : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలే..

దేవర రిలీజ్ ట్రైలర్ చూసేయండి..

Devara New Trailer : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలే..

NTR Janhvi Kapoor Devara Release Trailer Released

Updated On : September 22, 2024 / 2:12 PM IST

Devara New Trailer : ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి ఇప్పటికే ఒక ట్రైలర్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నేడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. మూవీ యూనిట్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.

Also Read : Devara : వామ్మో.. దేవర 9 గంటల కథ.. అందుకే రెండు పార్టులు.. ఎన్టీఆర్ కామెంట్స్..

ఇప్పటికే దేవరకు కావాల్సినంత హైప్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం దేవర మూవీ నుంచి మరో ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు. మీరు కూడా దేవర రిలీజ్ ట్రైలర్ చూసేయండి..

 

ఇక ఈ ట్రైలర్ లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు కాసంత ఎంటర్టైన్మెంట్ కూడా చూపించారు. ఎన్టీఆర్ రెండు పాత్రల్లో మరోసారి అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది. సముద్రంలో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోతాయని తెలుస్తుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.