Naga Chaitanya wedding photos with mother and uncle
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, శోభిత పెళ్లి బందంలోకి అడుగుపెట్టారు. రెండురోజుల క్రితం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. దాదాపుగా రెండేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్ళికి సంబందించిన ఫోటోలు నట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : Pushpa 2 : అఫీషియల్.. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు.. పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య పెళ్ళికి సంబందించిన మరో ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. దగ్గుబాటి ఫ్యామిలీ దగ్గరుండి నాగ చైతన్య వివాహం జరిపించారు. చైతు పెళ్లి ఫోటోలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. అయితే తాజాగా వెంకటేష్ చైతును పెళ్ళికొడుకు చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసారు. ఇక ఇందులో చైతన్య కన్న తల్లి కూడా మెరిశారు. నాగచైతన్య నాగార్జున మొదటి భార్య కొడుకు అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఇక నాగార్జున పెళ్లి సమయంలో ఆమె దగ్గరుండి నాగచైతన్యను పెళ్లి కొడుకు చేయించారు. ఈ సందర్బంగా వెంకటేష్ తల్లి, కొడుకుల ఫోటోలు షేర్ చేసారు.