విక్టరీ వెంకటేష్ నటించనున్న ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నాగ చైతన్య నటించనున్నాడని ఫిిలింనగర్ సమాచారం..
విక్టరీ వెంకటేష్ తెలుగు ‘అసురన్’ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’.. తమిళనాట దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్‌కి జోడిగా మంజు వారియర్ నటించింది.
ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్‌పై సురేష్ బాబు, కళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రియ కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
Read Also : ‘దోస్తానా 2’ – క్లాప్ కొట్టారు
‘అసురన్ ఫ్లాష్ బ్యాక్‌లో ధనుష్ యంగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. వయసు రీత్యా ధనుష్ యంగ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.. తెలుగు రీమేక్‌లో వెంకీ యంగ్ రోల్‌లో కనిపించడం కష్టం కాబట్టి ఆ క్యారెక్టర్ వెంకీ మేనల్లుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తే బాగుంటుంది.. ‘ప్రేమమ్’లో టీనేజ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు చైతు.. అసురన్ రీమేక్‌లో యంగ్ క్యారెక్టర్‌కి చైతు అయితే కరెక్ట్‌గా సరిపోతాడు’ అనే మాట సినీ వర్గాల్లో వినబడుతుంది..