Naga Manikanta Interesting Comments after Eliminating from Bigg Boss
Naga Manikanta : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నిన్నటితో ఏడో వారం ముగిసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. గత రెండు రోజులుగా నాగ మణికంఠ స్వయంగా నా వల్ల కావట్లేదు వెళ్ళిపోతాను అంటూ ఆరోగ్యం బాగోలేదు అనే కారణంతో బిగ్ బాస్ ని అడిగాడు. దీంతో నిన్న నాగార్జున నాగ మణికంఠను ఎలిమినేట్ చేసాడు.
నిన్న ఆదివారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో చివరికి నాగ మణికంఠ, గౌతమ్ మిగలగా నాగమణికంఠ తనే వెళ్ళిపోతాను అన్నాడు. ఇంట్లోవాళ్ళని నాగార్జున అడగ్గా అందరూ నాగమణికంఠనే పంపించేయమన్నారు. దీంతో నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే గౌతమ్ కి తక్కువ ఓట్లు పడ్డాయి కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి పంపించేస్తున్నాను అని నాగార్జున చెప్పడం గమనార్హం.
ఇక నాగమణికంఠ స్టేజిపైకి వచ్చాక నాగార్జున నీకు ఓట్లు వేసిన వాళ్లకు ఏం చెప్తావు అని అడగ్గా.. నాకు ఓట్లు వేసిన వాళ్లందరికీ సారీ. నేను మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు నా ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. లక్ష్మీదేవి కంటే కూడా ఆరోగ్యమే ముఖ్యం అందుకే వచ్చేసాను అంటూ చెప్పాడు. మరి బిగ్ బాస్ తర్వాత నాగమణికంఠ ఏం చేస్తాడో, ఎలాంటి అవకాశాలు తెచుకుంటాడో చూడాలి.