Naga Shaurya gave clarity on man who slapped his girlfriend infront of him
Naga Shaurya : ఈ ఏడాది ఫిబ్రవరిలో నడిరోడ్డు పై ఒక ప్రేమ జంట గొడవ పడుతున్న సమయంలో కారులో వెళ్తున్న నాగశౌర్య వారిని చూసి దిగి వారి మధ్య కలగజేసుకుని మాట్లాడిన ఒక వీడియో అప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే.. ఆ ప్రేమ జంటలోని అబ్బాయి తన ప్రియురాలి పై చెయ్యి చేసుకోవడం నాగశౌర్య చూశాడు. దానిని తప్పుబడుతూ ఆ అబ్బాయిని ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పమని నాగశౌర్య కోరాడు. కానీ క్షమాపణ చెప్పడానికి ఆ కుర్రాడు నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం అయ్యింది.
Naga Shaurya : నడిరోడ్డులో యువతి పై చెయ్యి చేసుకున్న వ్యక్తిని నిలదీసిన హీరో నాగశౌర్య..
కాగా నాగశౌర్య నటించిన కొత్త సినిమా ‘రంగబలి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఆ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు ఆ విషయం గురించి ప్రశ్నించారు. దీంతో నాగశౌర్య అసలు ఏమి జరిగిందనేది క్లారిటీ ఇచ్చాడు. “నేను పని మీద కూకట్‌పల్లిలో వైపు నుంచి కారులో వెళ్తున్న సమయంలో ఆ అబ్బాయి తన ప్రియురాలిని కొట్టడం చూశాను. దీంతో వెంటనే కారు ఆపి అతని దగ్గరికి వెళ్లి ఎందుకు కొడుతున్నావు, ఆమెకు సారీ చెప్పమని అడిగాను. అయితే దానికి ఆ అమ్మాయి ఏమందో తెలుసా..? ‘ఆ బాయ్‌ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు నీకేంటి’ అని అడిగింది. ఆ అమ్మాయే అలా అడిగితే ఇంక మనం మాత్రం ఏమి చేస్తాం. ఆ రోజు జరిగిన సంఘటనలో అబ్బాయిది తప్పుకాదు అమ్మాయిదే తప్పు. ఇంకో రూమర్ ఏంటంటే.. ప్రచారం కోసం నేనే ఆ గొడవని ప్లాన్ చేసానని అనుకున్నారు. కానీ వాళ్లిద్దరూ ఎవరన్నది నాకు అసలు తెలియదు” అంటూ వెల్లడించాడు.
Rashmi Gautam : సారీ చెప్పాలంటూ నాగశౌర్య.. ఇంకో సూసైడ్ చూడాలి అనుకుంటున్నారా అంటున్న రష్మీ!
అలాగే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఒక సలహా ఇచ్చాడు. “మిమ్మల్ని కొట్టే అబ్బాయిలను మాత్రం పెళ్లి చేసుకోవద్దు. అది మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అనే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. సరైన అబ్బాయిని ఎంచుకోలేక అమ్మాయిలే తప్పు చేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించాడు.