Naga Vamshi Huge Project With NTR
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాను కొరటాల తనదైన మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దనున్నారు.
Janhvi Kapoor : NTR30లో జాన్వీ ఫిక్స్? బాలీవుడ్‌లో వరుస కథనాలు..
ఇదిలా ఉండగా, తారక్‌తో త్రివిక్రమ్ గతంలో ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ తారక్‌తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండగా, ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఓ మైథలాజికల్ డ్రామాగా తీర్చిదద్దనున్నట్లు నిర్మాత తెలిపాడు.
NTR: తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘అదుర్స్’ అనాల్సిందే!
ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు నిర్మాత రెడీ అవుతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ను నాగవంశీ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా.. ఎలాంటి కథతో ఈ సినిమా రానుందా అనే ఆసక్తి అభిమానుల్లో క్రియేట్ అవుతోంది.