Nagababu Birthday Celebrations at Italy with Mega Family
Nagababu : మెగా ఫ్యామిలీ(Mega Family) అంత ప్రస్తుతం వరుణ్ తేజ్(Varun Tej) – లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్ళికి ఇటలీ వెళ్ళింది. అక్కడే ఇటలీలో మెగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న అక్టోబర్ 29న నాగబాబు పుట్టిన రోజు కావడంతో మెగా ఫ్యామిలీ సమక్షంలో బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. నాగబాబుకి విషెష్ చెప్తూ పలువురు అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వరుణ్ తేజ్ తన తండ్రితో ఇటలీలో(Italy) దిగిన ఫోటో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక నిహారిక(Niharika) తన తండ్రితో ఆడిన పాత వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే డాడీ. యు ఆర్ ది బెస్ట్ అని పోస్ట్ చేసింది. ఇక నాగబాబు కూడా ఇటలీలో రాత్రి పూట తన భార్యతో దిగిన ఫోటో, తను దిగిన ఫోటోలని షేర్ చేసి జీవితం గురించి ఓ కొటేషన్ పోస్ట్ చేశారు.
Also Read : Devara Update : ‘దేవర’ అప్డేట్ ఇచ్చిన జాన్వీ.. ఎన్టీఆర్ ‘దేవర’ నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?
నాగబాబు తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. పుట్టిన రోజున.. ఏదోకటి చెప్పాలి కాబట్టి చెప్తున్న… జీవితం అంటే అర్థం లేనిది… మరి జీవిత పరమార్థం ఏంటి…? అర్థం లేని జీవితంలో అర్థం వేతుకోవటమే…! అర్దం అయ్యిందా రాజా… (అర్థం చేసుకుంటే కింది స్థాయి వాళ్ళకి కూడా అర్ధం అవుతుంది.. డిగ్రీ చదవాల్సిన పని లేదు) అని సరదాగా పోస్ట్ చేశారు. దీంతో నాగబాబు ఫొటోలు, పోస్ట్ వైరల్ గా మారింది.