Devara Update : ‘దేవర’ అప్డేట్ ఇచ్చిన జాన్వీ.. ఎన్టీఆర్ ‘దేవర’ నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?
ఎన్టీఆర్(NTR) నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రెండు పార్టులుగా ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది.

NTR Koratala Shiva Devara Movie Shooting Update
Devara Update : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR) నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రెండు పార్టులుగా ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) దేవరలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కోసం పలువురు హాలీవుడ్ మేకర్స్ ని కూడా రప్పించారు.
దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్ గత కొన్ని రోజులుగా గోవాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. తాజాగా జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దేవర షూటింగ్ పూర్తయిందని పోస్ట్ చేసింది. జాన్వీ గోవా షెడ్యూల్ పూర్తి చేసి ముంబై రిటర్న్ అయింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో జాన్వీ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక గోవా షెడ్యూల్ తర్వాత గోకర్ణలో నెక్స్ట్ షెడ్యూల్ వెంటనే మొదలుపెట్టేస్తారని సమాచారం. జాన్వీ త్వరలో గోకర్ణలో జరిగే షెడ్యూల్ లో మళ్ళీ చేరుతుందని తెలుస్తుంది.
దేవర సముద్ర తీరాల్లో జరిగే చాలా పవర్ ఫుల్ కథ అని డైరెక్టర్ కొరటాల శివ ఆల్రెడీ చెప్పి సినిమాపై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో సముద్రం ఉన్న మంచి మంచి లొకేషన్స్ వెతికి మరీ దేవర సినిమా షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పార్ట్ 1 వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
#JanhviKapoor Post Wrap-up The @tarak9999's #Devara Shooting In Goa. #Bollywood #telugu #JrNTR #janhvi #teluguactress pic.twitter.com/PN2r9bmarj
— Filmy Uncle (@One4you384316) October 30, 2023