Suriya : ఖైదీ సీక్వెల్ తర్వాతే రోలెక్స్.. సూర్య వర్సెస్ కార్తీ.. అన్నదమ్ముల ఫైట్ ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన సూర్య..
తాజాగా కార్తీ 25వ సినిమా జపాన్(Japan) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూర్య తన తమ్ముడి సక్సెస్ గురించి మాట్లాడుతూ..

Suriya gives Clarity on Karthi Khaidi Sequel and Rolex Movies
Suriya : లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్(LCU) లో కార్తీ(Karthi) ఢిల్లీ క్యారెక్టర్ లో హీరోగా, సూర్య రోలెక్స్(Rolex) క్యారెక్టర్ లో విలన్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఢిల్లీ సీక్వెల్, రోలెక్స్ పాత్రతో సపరేట్ సినిమా ఉంటుందని ఆల్రెడీ ప్రకటించారు. ఇక అన్నదమ్ముల ఇద్దరి మధ్య సీన్స్ కూడా ఉండొచ్చని గతంలోనే లోకేష్ చెప్పాడు. సూర్య కూడా గతంలో తమ్ముడికి విలన్ గా నటించాలని ఉందని చెప్పాడు.
తాజాగా కార్తీ 25వ సినిమా జపాన్(Japan) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా చిత్రయూనిట్ తో పాటు సూర్య, జయం రవి, విశాల్, లోకేష్ కనగరాజన్.. పలువురు ప్రముఖులు అతిధులుగా విచ్చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూర్య తన తమ్ముడి సక్సెస్ గురించి మాట్లాడుతూ.. నా కంటే ఇప్పుడు తమ్ముడికి ఎక్కువ అభిమానులు ఉన్నారు. కొంతమంది అభిమానులు నన్ను కలిసినప్పుడు కార్తీ అంటే ఇష్టం అని చెప్తుంటే నాకు గర్వంగా ఉంది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
అలాగే.. నా జీవితంలో అదృష్టం కొద్దీ లోకేష్ పరిచయమయ్యాడు. నా పేరును రోలెక్స్ లా మార్చేశాడు. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రోలెక్స్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలో మిమ్మల్ని రోలెక్స్ కలుస్తాడు. కానీ ఢిల్లీ తర్వాతే రోలెక్స్ వస్తాడు. ఢిల్లీని కలుస్తాడు రోలెక్స్ అంటూ సూర్య ఖైదీ సీక్వెల్ పై, రోలెక్స్ సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు సూర్య. దీంతో సూర్య, కార్తీ, లోకేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమాలు త్వరగా రావాలని కోరుకుంటున్నారు.