Naga Babu : వాళ్లు చేసిన పాపాన్ని ప‌వ‌న్ క‌డిగేస్తున్నారు.. నాగ‌బాబు ట్వీట్ వైర‌ల్‌..

తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

Nagababu comments on Pawan Kalyan Performs Purification Ritual At Kanaka Durga Temple

తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆల‌య మెట్ల‌ను శుభ్రం చేశారు. ఆ త‌రువాత మెట్ల‌కు పసుపు రాసి కుంకుమ బొట్ల‌ను పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పవన్ ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ప‌వ‌న్ వైసీపీ నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ను విమ‌ర్శించే వైసీపీ వాళ్ల‌కి ఒక‌టే చెబుతున్నాన‌ని.. గొడ‌వ పెట్టుకోవాలంటే ఎంత గొడ‌వ‌కి అయినా తాను సిద్ధం అని అన్నారు. సనాతన ధర్మం జోలికి రాకండి అని సూచించారు. సనాతన ధర్మం కోసం త‌న ప్రాణాల‌ను ఇవ్వ‌డానికైనా సిద్ధ‌మ‌న్నారు. స‌నాత‌న ధ‌ర్మంపై ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేద‌న్నారు.

Bigg Boss 8 : కాంతార చీఫ్ టాస్క్‌.. య‌ష్మికి సీత షాక్‌.. మ‌ణికంఠకు అంత‌సీన్ లేద‌న్న పృథ్వీ

ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పై సినీ న‌టుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. .జగన్ మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్తం చేసి కడిగేస్తున్నాడు. అని నాగ‌బాబు రాసుకొచ్చారు.

Alia Bhatt : జాన్వీ ‘చుట్టమల్లే..’ సాంగ్‌ని క్యూట్ గా పాడిన అలియా భట్.. మురిసిపోయిన ఎన్టీఆర్..