Bigg Boss 8 : కాంతార చీఫ్ టాస్క్.. యష్మికి సీత షాక్.. మణికంఠకు అంతసీన్ లేదన్న పృథ్వీ
రెండో చీఫ్‌ను ఎన్నుకునే ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టాడు.

Bigg Boss Telugu 8 Day 23 Promo Battle for Power in BB House
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కావడంతో రెండో చీఫ్‌ను ఎన్నుకునే ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది.
నిఖిల్ ప్రస్తుతం చీఫ్‌గా ఉండడంతో అతడు కాకుండా మిగిలిన 10 మంది సభ్యుల బొమ్మలను ఓ టేబుల్ మీద ఉంచారు. అందులో ఎవరి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వాళ్లు కాంతార టీమ్‌కి చీఫ్‌గా ఉంటారని బిగ్‌బాస్ ప్రకటించారు.
Alia Bhatt : జాన్వీ ‘చుట్టమల్లే..’ సాంగ్‌ని క్యూట్ గా పాడిన అలియా భట్.. మురిసిపోయిన ఎన్టీఆర్..
మణికంఠ బొమ్మను పృథ్శీ పగలగొట్టాడు. ఇక రెండో సారి చీఫ్ అవ్వాలని భావించిన యష్మి బొమ్మను సీత పగలకొట్టింది. నబీల్ బొమ్మను సోనియా పగలకొట్టగా, విష్ణుప్రియ బొమ్మను నైనిక పగలకొట్టింది.
ఇలా ఒక్కొక్కరి బొమ్మ పగిలిపోగా ఆఖరికి ప్రేరణ, కిర్రాక్ సీత బొమ్మలు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా ప్రొమోను బట్టి అర్థమవుతోంది. మరి వీరిద్దరిలో విజేతగా నిలిచి కాంతార టీమ్ చీఫ్ ఎవరు అవుతారో చూడాల్సిందే.