MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ కాలిగోటికి కోట సరిపోరు..! నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

గణేశ్ సినిమాలో కోట చేసిన యాక్టింగ్ ఐకానిక్ అన్నారు నెటిజన్లు. వంద సినిమాల్లో నటించినా ప్రకాశ్ రాజ్ ఈ ఒక్క సినిమాలో కోట యాక్టింగ్ కు సరిపోరని ఆయన వీరాభిమానులు అంటున్నారు.

Nagababu On Kota

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఇవాళే జరుగుతోంది. ఐతే.. ఒక్కరోజు ముందు పోటీదారులు, మద్దతుదారుల మాటల యుద్ధం పతాకస్థాయికి చేరిపోయింది. ప్రకాశ్ రాజ్ ఏనాడూ షూటింగ్ కు టైంకు రాలేదు.. ఆయనకు క్రమశిక్షణ లేదు అని ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ తరఫున మెగా మద్దతుదారు అయిన నాగబాబు ఈ కామెంట్స్ ను తిప్పికొడుతూ వస్తున్నారు. సరిగ్గా 24 గంటల ముందు.. ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

MAA Elections : మొదలైన ‘మా’ సమరం

నటన విషయంలో ప్రకాశ్ రాజ్ కాలి గోటికి కూడా కోట శ్రీనివాసరావు లాంటివాళ్లు సరిపోరని సీరియస్ కౌంటర్ ఎటాక్ చేశారు నాగబాబు. ప్రకాశ్ రాజ్ జాతీయ స్థాయి ఆర్టిస్టనీ… ఐదు నేషనల్ అవార్డులు గెల్చుకున్నారని చెప్పారు మెగా బ్రదర్. ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లను చూసి.. కోట లాంటి నటులందరికీ కుళ్లు అని చెప్పారు. ఈ కుళ్లుతో కోట ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు నాగబాబు.

Anchor Suma : యాంకర్ సుమకి అరుదైన వ్యాధి.. షాక్ లో అభిమానులు

నాగబాబుపై నెటిజన్లు సీరియస్

టీవీ ఇంటర్వ్యూలో నాగబాబు చేసిన కామెంట్స్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలుగు సినిమాలో గ్రేటెస్ట్ యాక్టర్లలో ఒకడిగా కోట శ్రీనివాసరావుకు పేరుంది. 1978లో చిన్న స్థాయి ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన కోట… తెలుగు సినిమాల్లో… విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. వెయ్యి సినిమాలు చేశారు. కోట శ్రీనివాసరావు 43ఏళ్లుగా తెలుగు సినిమాపై చెరగని ముద్రవేస్తూనే ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ఎంత గొప్ప నటుడైనా… ఆయన రేంజ్ ఏదైనా.. కోట శ్రీనివాసరావు లాంటి వర్సటైల్ ఆర్టిస్టును, సీనియర్ ను… ప్రకాశ్ రాజ్ లాంటి నటుడి కాలిగోటికి కూడా సరిపోరని నాగబాబు కామెంట్ చేయడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.

111

నాగబాబు.. గణేశ్ మూవీ చూడండి
గణేశ్ సినిమాలో కోట చేసిన యాక్టింగ్ ఐకానిక్ అన్నారు నెటిజన్లు. వంద సినిమాల్లో నటించినా ప్రకాశ్ రాజ్ ఈ ఒక్క సినిమాలో కోట యాక్టింగ్ కు సరిపోరని ఆయన వీరాభిమానులు అంటున్నారు. ఎవరి యాక్టింగ్ స్టైల్ వారిది… అలాగే కోట శ్రీనివాసరావు స్టైల్ ఆయనకు ఉంటుందని కామెంట్లతో నాగబాబుకు క్లాస్ తీసుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ కోసం కోటను తక్కువ చేయడం కరెక్ట్ కాదని నాగబాబుకు హితవు పలుకుతున్నారు.

222

మెగా ఫ్యామిలీకి ఎన్ని నేషనల్ అవార్డులు వచ్చాయి మరి

తెలుగు ఇండస్ట్రీలోనే కోట గ్రేటెస్ట్ యాక్టర్ అనీ.. నిజానికి ఆయన కాలిగోటికి నాగబాబు సరిపోరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీలోనూ నేషనల్ అవార్డు ఎవరికీ రాలేదనీ… మెగా ఫ్యామిలీలో ఎవరూ కూడా ప్రకాశ్ రాజ్ కాలిగోటికి సరిపోరనేనా మీ మాటల ఉద్దేశమా అని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు ఇంకొందరు. అసలు ఇన్ని ఎందుకు.. ప్రకాశ్ రాజ్ ఓడిపోవడానికి నాగబాబు ఇచ్చిన ఈ ఒక్క ఇంటర్వ్యూ చాలనేది ఇంకొందరి వెర్షన్. ఈ పొగరుబోతు మాటలే విష్ణును గెలిపిస్తాయని అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

3333