MAA Elections : నేడే ‘మా’ ఎన్నికలు.. టాలీవుడ్ లో హడావిడి..

ఎలక్షన్స్ కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఇవాళ ఉదయం జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో 8 గంటలకు ‘మా’ ఎలక్షన్స్ జరగనున్నాయి. 'మా' అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో

MAA Elections : నేడే ‘మా’ ఎన్నికలు.. టాలీవుడ్ లో హడావిడి..

Maa

MAA Elections :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడింది. గత కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్నారు. వీరి తరపున రెండు ప్యానెల్స్ లో ఆర్టిస్టులు హోరాహోరీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు ప్యానెల్స్ రోజూ ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలు, ఫిర్యాదుల వరకు వెళ్లారు. దీంతో ఈ సారి ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ని మించిపోయాయి. టాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఈ ఎలక్షన్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఎలక్షన్స్ కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. ఇవాళ ఉదయం జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో 8 గంటలకు ‘మా’ ఎలక్షన్స్ జరగనున్నాయి.

‘మా’ అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం మొత్తం రెండు ప్యానళ్ల తరపున 54 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిల్మ్ నగర్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 30 ఏళ్లుగా వివిధ రకాల ఎన్నికలను నిర్వహిస్తున్న తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులు ఈ ఎన్నికలని కూడా నిర్వహిస్తున్నారు. 20 మంది తెలంగాణ కో-అపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్ నిర్వహించనున్నారు. ‘మా’ ఎన్నికలకు 50 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ‘మా’ ఎన్నికల్లో 10 పేజీలతో కూడిన బ్యాలెట్ పేపర్ ని సిద్ధం చేశారు. పదవులకు అనుగుణంగా వివిధ రంగుల్లో బ్యాలెట్ పేపర్ ని ముద్రించారు.

Online Ticketing : ఆన్లైన్ టికెటింగ్ పై ఏపీ సీఎంకి థ్యాంక్స్ చెప్పిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

పోలింగ్ అయిన తర్వాత సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదట ఈసీ మెంబర్ల ఫలితాలు వెల్లడిస్తారు. ఆఖరికి ‘మా’ అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు చేపడతారు. రాత్రి 8 గంటల లోపు మొత్తం ఫలితాలు వెల్లడి కానున్నాయి. టాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘మా’ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలంటే రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.