×
Ad

Nagababu : ఫ్రెండ్స్ ముందు అతన్ని అవమానించిన నాగబాబు.. రెండు రోజుల్లో ఆయనే మెచ్చుకునేలా కంబ్యాక్..

నాగబాబు తనని అవమానించిన సంగతి బయటపెట్టాడు జబర్దస్త్ వెంకీ.(Nagababu)

Nagababu

Nagababu : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్స్ లో వెంకీ ఒకరు. జబర్దస్త్ మొదలయినప్పుడే ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత వెంకీ మంకీస్ టీమ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. కొన్ని నెలల క్రితమే వెంకీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాడు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక వెంకీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి అనేక విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో నాగబాబు తనని అవమానించిన సంగతి బయటపెట్టాడు.(Nagababu)

జబర్దస్త్ వెంకీ మాట్లాడుతూ.. మిమిక్రి ద్వారా చంద్రన్న పరిచయం అయితే ఆయన జబర్దస్త్ లోకి పిలిచారు. ఆయన టీమ్ లో మెంబర్ గా వెళ్ళాను. తర్వాత రాఘవ గారి టీమ్ లో, వేణు టీమ్ లో చేశా. తర్వాత నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది. కానీ నా వల్ల కాలేదు మొదట్లో. ఒక రోజు నేను బాగా అవమానపడ్డాను. నా ఫ్రెండ్స్ వరంగల్ నుంచి వచ్చారు నా స్కిట్స్ చూద్దామని. సెట్ లో ఓ పక్కన కూర్చొని చూస్తున్నారు. నా స్కిట్ అయ్యాక ఆ రోజు నాగబాబు గారు నా మీద ఫైర్ అయ్యారు. అసలు మీరు ఏం మనుషులు, ఇది స్కిట్టా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని పిలిచి ఇది స్కిట్ అంటారా? మీరు చూడరా అని అందరి ముందు బాగా తిట్టారు. అక్కడ నా ఫ్రెండ్స్ ఇదంతా చూసి షాక్ అయ్యారు. నాకైతే బాగా అవమానం అనిపించింది. మా ఫ్రెండ్స్ ముందు తిట్టేసరికి బాగా ఫీల్ అయ్యాను.

Also Read : Jabardasth Venkey : అందుకే జబర్దస్త్ మానేశా.. మనుసు చంపుకొని వెళ్ళను.. జబర్దస్త్ షోపై వెంకీ సంచలన కామెంట్స్..

ఆ తర్వాత డైరెక్టర్స్ పిలిచి నీది లాస్ట్ షెడ్యూల్ ఇది అన్నారు. దాంతో ఫీల్ అయి వరంగల్ వెళ్ళిపోయాను. కానీ మేము సరిగ్గా చేయలేదు కాబట్టి నాగబాబు గారు మా మంచికే తిట్టారు అని అర్ధం చేసుకున్నా. ఓ రెండు రోజుల తర్వాత డైరెక్టర్స్ మళ్ళీ కాల్ చేసి ఇంకా కొత్త టీమ్ ఏది సెట్ అవ్వలేదు. వచ్చి ఒక చివరి స్కిట్ చెయ్యి అని కోపంతోనే అన్నారు. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు అనిపించింది. అప్పటిదాకా మా టీమ్ కి రైటర్స్ ఇచ్చారు. కానీ ఈసారి నేనే రాసుకోవాలి అనిపించింది.

Jabardasth Venkey

అప్పుడే హనుమాన్ జంక్షన్, గుండె జారి గల్లంతయిందే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూసా. అందులో మిస్ గైడ్ కామెడీలా ఉందని ఒక రెండు లైన్స్ అనుకోని చేశాను. డైరెక్టర్స్ ముందు చేస్తే బాగుంది చెయ్యి అన్నారు. స్టేజి మీదకు స్కిట్ చేద్దామని ఎక్కితే నాగబాబు గారు మళ్ళీ వీడ్ని పెట్టారా అని డైరెక్టర్స్ ని అడిగారు. ఇంకా కొత్త టీమ్ సెట్ అవ్వలేదు అని చెప్పడంతో సరే చేయమన్నారు. మేము స్కిట్ మొదలుపెట్టాక నాగబాబు గారు ఫుల్ గా నవ్వుకున్నారు. స్కిట్ అయ్యాక గుడ్ అని నాగబాబు గారు, రోజా మేడం అభినందించారు.

Also See : Esther Anil : గ్రాడ్యుయేషన్ ఫొటోలు షేర్ చేసిన నటి.. ఓ పక్క చదువుతూనే మరో పక్క సినిమాలు..

ఇంకో ఎపిసోడ్ కి అదే రోజు షూట్. దానికి మా ఇంట్లో జరిగిన ఓ సంఘటనని గిఫ్ట్ తో కామెడీ స్కిట్ లా, కన్ఫ్యూజన్ డ్రామాలా రాసుకొని చేశాను. ఆ స్కిట్ నా రాతని, నా లైఫ్ ని మార్చింది. జీవన్, నేను కలిసి ఆ స్కిట్ చేసాము. సెట్ లో అందరు విజిల్స్, అరుపులు. నాగబాబు గారు కూడా ఫుల్ గా నవ్వుకున్నారు. స్కిట్ అయ్యాక పిలిచి హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి కన్ఫ్యూజన్ కామెడీతో సక్సెస్ అయ్యా అని తెలిపాడు.