Naga Babu: బాటసారి నాగబాబు.. సినిమాలకు గుడ్ బై?.. రాజకీయలకు సెలవా?
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మెగా బ్రదర్ నాగబాబు.. రాజకీయాల నుండి సినిమా ఇండస్ట్రీ సమస్యల వరకు ప్రతి అంశంపై స్పందించే ఆయన వ్యక్తులను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లతో..
- Naresh Mannam
- Published On : March 13, 2022 / 07:38 AM IST
Naga Babu
Naga Babu: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మెగా బ్రదర్ నాగబాబు.. రాజకీయాల నుండి సినిమా ఇండస్ట్రీ సమస్యల వరకు ప్రతి అంశంపై స్పందించే ఆయన వ్యక్తులను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లతో కూడా వివాదాలు కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. గతంలో కాస్త అగ్రెసివ్ గా కనిపించే నాగబాబు ఈ మధ్య కాస్త సామరస్యంగా కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కాస్త స్పీడ్ తగ్గించి అలోచించి మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే నాగబాబు పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Naga Babu : స్టైలిష్ లుక్‌లో మెగాబ్రదర్ నాగబాబు.. అదంతా నాగ శ్రీను పనితనమే..!
ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ పెట్టిన ఈ పోస్ట్ పై అనేక సందేహాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు మరియు కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను.
Nagababu : చిరంజీవితో విభేదాలు సృష్టించడానికి కుట్ర – నాగబాబు
ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా, కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే.. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా.. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. అయితే నాగబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.
NagaBabu: మీ అధికారం ఐదేళ్లే జగన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై నాగబాబు
ఈ పోస్టును బట్టి చూస్తే సినిమాలు లేదా రాజకీయాలలో ఒక దానికి దూరమవుతాడని అనిపిస్తుంది. మరి సినిమాలకు దూరమవుతాడా? లేక రాజకీయలా నుంచి తప్పుకోబోతున్నాడా? అనే అనుమానాలు నెటిజన్స్‌లో మొదలయ్యాయి. దాదాపుగా అడపాదడపా సినిమాలు.. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు.. వాటికి గుడ్ బై చెప్పేసి.. పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరమవుతాడేమో అనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది… pic.twitter.com/OcuygCcMHv
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 12, 2022
