Nagababu : చిరంజీవితో విభేదాలు సృష్టించడానికి కుట్ర – నాగబాబు

కేసీఆర్, కేటీఆర్ లపై తాము విమర్శలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.

Nagababu : చిరంజీవితో విభేదాలు సృష్టించడానికి కుట్ర – నాగబాబు

Bheemla Nayak Film Issue : వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకపడ్డారు మెగా బ్రదర్ నాగబాబు. మీ పాలన ఎలా ఉందో మీకైనా తెలుస్తుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. పగ, ప్రతీకారంతో పాలన చేయవద్దని, ఒక మాట అనగానే ఎందుకంత పౌరుషం అంటూ వ్యాఖ్యానించారు. మీరు అన్నింటికీ అతీతులా ? మంత్రులు వాడే భాష మేము వాడలేమా ? అని ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలైంది. సినిమా విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇటీవలే వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. తాజాగా విమర్శల వర్షం కురిపించారు.

Read More : భీమ్లా నాయక్ రగడ.. నాగబాబు Vs రోజా

సీఎం జగన్ మంచిగా పాలిస్తే తాము సంతోషిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని పరిశ్రమగా గుర్తించాయా ? తమకు ఫైనాన్స్ లు ఇచ్చి టికెట్ ధరలు మీ ఇష్టమొచ్చినట్లు పెట్టండని సలహా ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ లపై తాము విమర్శలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. చిరంజీవికి తమకు మధ్య విబేధాలు సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని విబేధించారు కాబట్టే పవన్ ను టార్గెట్ చేశారా ? మీతో కలవలేదు కాబట్టే మహేశ్ బాబును కార్నర్ చేస్తారా అని నిలదీశారు.

Read More : NagaBabu: మీ అధికారం ఐదేళ్లే జగన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై నాగబాబు

వైసీపీ ప్రభుత్వానికి మంత్రులకు సినిమా వాళ్ళ ఆపరేషన్స్ గురించి తెలియదన్నారు. సామాన్యుడికి టిక్కెట్ ధర అందుబాటులో ఉండాలనే దానికి తాను ఏకీభవిస్తున్నట్లు, సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెరగాలంటే రిచ్ నేస్ తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టోటల్ సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యునరేషన్ లు పది లేదా పన్నెండు పర్సెంట్ ఉంటుందన్నారు. రెమ్యునరేషన్ ఖర్చు కాదు… అనే అజ్ఞానపు మాటలు మాట్లాడే వాళ్లకు సినిమా మేకింగ్ గురించి ఏమి అర్థం అవుతోందన్నారు. సినిమా రెమ్యునరేషన్ అంటే సినిమా ఖర్చులో భాగమని, ఎంత మంది హీరోలు ఎన్ని సినిమాలకు వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు ఎంత వెనక్కి ఇచ్చారు అనే డేటా మీదగ్గర లేదని నాగబాబు వెల్లడించారు.