Naga Babu : స్టైలిష్ లుక్‌లో మెగాబ్రదర్ నాగబాబు.. అదంతా నాగ శ్రీను పనితనమే..!

మెగా బ్రదర్ నాగబాబు కొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించారు. అందంగా ట్రెండీ లుక్‌లో మేక్ ఓవర్ చేసిన హెయిర్ డ్రెస్సెర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

Naga Babu : స్టైలిష్ లుక్‌లో మెగాబ్రదర్ నాగబాబు.. అదంతా నాగ శ్రీను పనితనమే..!

Naga Babu Mega Brother Naga Babu Shares Make Up Artist Hair Dresser Naga Srinu

Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు కొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఆయన ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఆ సినిమాలో డిఫరెంట్ రోల్ చేయబోతున్నారా? అందుకేనా ఈ ట్రెండీ లుక్ అంటే కానే కాదు.. ఇదంతా మేక్ ఓవర్ చేసిన హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీను పనితనమట.. నాగ శ్రీను పనితనాన్ని మెచ్చుకుంటూ.. ఇదిగో నన్ను ఎంతగా అందంగా మలిచాడో చూడండి అంటూ కొన్ని ఫొటోలను నాగబాబు షేర్ చేశారు. ఆ ఫొటోల్లో నాగబాబు ట్రెండీ లుక్‌లో కనిపించారు.  ఈ సందర్భంగా నాగ శ్రీనును పొగుడుతూ.. నీ ప్రతిభే ఎప్పుడూ నీ విజయానికి దగ్గర చేస్తుందని నాగబాబు అన్నారు. నీ పనితనాన్ని మెచ్చే.. ఆ రోజు నీకు రూ.50వేల చెక్ ఇచ్చిందని, ఎప్పుడూ ఇలానే కష్టపడుతూ ఉండాలని నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు షేర్ చేసిన మేక్ ఓవర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. మంచు ఫ్యామిలీతో నాగ శ్రీను వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. కొన్ని రోజుల క్రితం విష్ణు మంచు ద‌గ్గ‌ర ప‌నిచేసిన నాగ శ్రీను ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల మేక‌ప్, హెయిర్ డ్రెస్సింగ్ వస్తువుల‌ను దొంగ‌త‌నం చేశాడంటూ పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. నాగ శ్రీనుకు ఆర్థిక సాయం కూడా చేశారు. అంతేకాకుండా నాగశ్రీను కుటుంబానికి రూ.50వేల చెక్ ఇచ్చి ఆర్థిక సాయాన్ని కూడా చేశారు నాగబాబు. అయితే మా ఎన్నికల సమయంలో ప్రతికారాన్ని నాగబాబు ఇలా తీర్చుకున్నారేమోనంటూ కామెంట్లు వచ్చాయి.

ఇటీవలే మంచు మోహ‌న్‌బాబు, విష్ణు కలిసి ఒక హెయిర్ డ్రెస్సర్ పై తమ విలువైన మేకప్ సామాన్లు దొంగలించారని పోలీసు కేసు పెట్టారు. అయితే ఆ హెయిర్ డ్రెస్సర్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. త‌న‌ను, త‌న కుల వృత్తిని అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించాడ‌ని, అందుకే జాబ్ లోంచి మానేస్తే తిరిగి త‌నపైనే త‌ప్పుడు కేసు పెట్టాడంటూ తెలిపాడు. దీంతో గత రెండు రోజులుగా ఈ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అయింది. ఆ హెయిర్ డ్రెస్సర్ ని కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి. ఈ ఇంటర్వ్యూలలో తన తప్పేమి లేదని, నేను చాలా దీన స్థితిలో ఉన్నానని, తన కుటుంబ పరిస్థితుల గురించి చెప్పాడు.

 

View this post on Instagram

 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

హెయిర్ డ్రెస్సర్ నాగ‌శ్రీను త‌న‌ తల్లి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హాస్పిట‌ల్‌లో ఉంద‌ని, త‌న‌కు జీతం కూడా రాలేద‌ని, డ‌బ్బుల‌కు చాలా ఇబ్బందిగా ఉంద‌ని తెలిపాడు ఇంటర్వ్యూలో. ఈ విషయం మెగా బ్రదర్ నాగబాబుకు తెలియడంతో నాగ శ్రీనుని పిలిపించి 50వేల రూపాయల‌ ఆర్ధిక సహాయం చేశాడు. అంతే కాక వారికి అపోలో ఆస్ప‌త్రిలో మెడిక‌ల్ చెక‌ప్ కూడా ఫ్రీగా చేయిస్తామని మాట ఇచ్చారు. దీంతో నాగశ్రీను నాగబాబుకి థ్యాంక్స్ చెప్తూ ఆనందం వ్యక్తం చేశాడు.

Read Also : Nagababu : హెయిర్ డ్రెస్సర్‌కి మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు స‌హాయం.. అందుకేనా??