నాగకన్య- మే 10 న వస్తోంది

నాగకన్య సినిమాని మే 10 న విడుదల చెయ్యనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.

  • Published By: sekhar ,Published On : April 17, 2019 / 11:57 AM IST
నాగకన్య- మే 10 న వస్తోంది

Updated On : April 17, 2019 / 11:57 AM IST

నాగకన్య సినిమాని మే 10 న విడుదల చెయ్యనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.

జై, రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్స్‌గా, ఎల్.సురేష్ డైరెక్షన్‌లో, జంబో సినిమాస్ బ్యానర్‌పై.. ఏ.శ్రీధర్ ప్రొడ్యూస్ చేస్తున్న తమిళ్ మూవీ… నీయా 2.. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని.. నాగకన్య పేరుతో తెలుగులో రిలీజ్ చెయ్యబోతున్నారు. మొన్నామధ్య విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నాగదోషం, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన నాగకన్య సినిమాని మే 10 న విడుదల చెయ్యనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా రాయ్ లక్ష్మీ న్యూ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు.

అనుక్షణం ఆడియన్స్‌ని థ్రిల్‌కి గురిచేసే అంశాలు ఎన్నో ఈ మూవీలో ఉన్నాయట. కోలీవుడ్‌తో పాటు, టాలీవుడ్ ప్రేక్షకులనుకూడా నాగకన్య ఆకట్టుకుంటుందని దర్శకుడు ధీమాగా చెప్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం : షబీర్, కెమెరా : రాజీవ్ మీనన్, ఎడిటింగ్ : గోపీకృష్ణ.

వాచ్ నాగకన్య ట్రైలర్…