Nagarjuna : ఎలక్ట్రిక్ కారు కొన్న నాగార్జున.. రేటు ఎంతో తెలుసా..?
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఫిట్‌గా ఉంటూ యంగ్ హీరోల కన్నా చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.

Nagarjuna buy Kia EV6
Nagarjuna buy Kia EV6 : టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఫిట్‌గా ఉంటూ యంగ్ హీరోల కన్నా చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. గతేడాది ఆయన నటించిన ఘోస్ట్ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అప్పటి నుంచి మరో కొత్త సినిమాను ఆయన పట్టాలెక్కించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలో లగ్జరీ ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీలో యాడ్ చేసుకున్నారు కింగ్. ఆయన కొన్న కారు కియా ఈవీ6(Kia EV6 ). ఆయన ఇంటి వద్దనే కారును డెలీవరీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కియా డీలర్లు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో నాగార్జునతో పాటు ఆయన భార్య అమలను చూడొచ్చు. కాగా.. కారు కలర్ వైట్.
కారు ప్రత్యేకతలు ఇవే..
10 రకాలుగా డ్రైవర్ సీట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ కీ, వైర్ లెస్ ఛార్జర్, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, రీ జనరేటివ్ బ్రేకింగ్‍కు ప్యాడిల్ షిఫ్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి పుల్ ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా ప్రయాణించవచ్చు. నాలుగున్న నిమిషాలు చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. దీని కోసం కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్‌ను అమర్చారు. ముఖ్యంగా ఈ కారు లుక్ సూపర్‌గా ఉంది. ఇక ధర విషయానికి వస్తే రూ.60 నుంచి 70లక్షల మధ్యలో ఉంటుంది.
Maa Oori Polimera 2 : మా ఉరి పొలిమేర-2 కోసం వరుణ్ తేజ్.. ఏం చేస్తున్నాడో తెలుసా..?
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఘోస్ట్ సినిమా తరువాత కథల ఎంపికలో నాగార్జున మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట. ముగ్గురు దర్శకులు ఆయన్ను కలిసి కథలు వినిపించినట్లు తెలుస్తోంది. వీరిలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి చెప్పిన కథ నాగ్‌కు నచ్చిందట. ఆయనతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వస్తే గానీ ఇది ఎంత వరకు నిజమో అన్నది తెలుస్తుంది.