Bangarraju Sequel : ఈసారి ‘బంగార్రాజు’లో ముగ్గురు హీరోలు.. లెనిన్ రిజల్ట్‌తో అఖిల్ ని కూడా లైన్ లో పెట్టిన కింగ్..

ఇప్పుడు బంగార్రాజు సీక్వెల్ మళ్ళీ మొదలవుతుందని టాక్. (Bangarraju Sequel)

  • Published on- July 14, 2026 / 10:05 AM IST

Bangarraju Sequel

Bangarraju Sequel : కింగ్ నాగార్జున 2016లో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమాకు సీక్వెల్ గా 2022లో బంగార్రాజు తెరకెక్కించి అందులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించి మరో విజయం సాధించారు. ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని గతంలో నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అన్నారు. కానీ ఆ సీక్వెల్ పనులు పలు కారణాలతో ఆగిపోయాయి. అయితే ఇప్పుడు బంగార్రాజు సీక్వెల్ మళ్ళీ మొదలవుతుందని టాక్.

హీరోగా అరంగ్రేటం చేసిన దగ్గర్నుంచి ఒక్క హిట్ కూడా లేని అఖిల్ ఇప్పుడు లెనిన్ సినిమాతో హిట్ కొట్టాడు. దీంతో అఖిల్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. లెనిన్ సినిమాకు నాగార్జున నిర్మాతగా మారి సినిమాలో కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేసారు. లెనిన్ సినిమాకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు నాగార్జున. ఇప్పుడు లెనిన్ హిట్ తర్వాత కూడా ఇదే విజయం కంటిన్యూ అవ్వాలంటే కరెక్ట్ సినిమా కావాలి.

Also Read : Bhagyashri Borse : కలెక్షన్స్ రాకపోతే అది నా తప్పు కాదు.. భాగ్యశ్రీ వ్యాఖ్యలు వైరల్..

అందుకే నాగార్జున మరోసారి అఖిల్ కి హిట్ ఇవ్వడానికి బంగార్రాజు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఈసారి బంగార్రాజు సీక్వెల్ లో నాగార్జున, నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా ఉంటాడని, ముగ్గురు మన్మధులు కలిసి అదరగొడతారని తెలుస్తుంది. ఈ ముగ్గురు హీరోలు కలిసి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో 2028 సంక్రాంతి పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

ఈ సీక్వెల్ ని కూడా అదే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నే చేస్తాడని సమాచారం. కళ్యాణ్ కృష్ణ 2022లో బంగార్రాజు తర్వాత మళ్ళీ ఏ సినిమా చేయలేదు. చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసారు కానీ అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాగార్జున – నాగచైతన్య – అఖిల్ ని పెట్టి బంగార్రాజు సీక్వెల్ రాయమని కళ్యాణ్ కృష్ణకు నాగార్జున నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది. గతంలో ఓ రెండు సార్లు ఈ ముగ్గురు కలిసి సోగ్గాడే చిన్ని నాయన గెటప్ లో కనిపించారు. ఆ ఫ్రేమ్ ఇప్పటికి అక్కినేని ఫ్యాన్స్ కి స్పెషల్. ఇక ఆ గెటప్స్ తో బంగార్రాజు సినిమా సీక్వెల్ జరిగితే అక్కినేని ఫ్యాన్స్ కి మరో పండగే.