Bhagyashri Borse : కలెక్షన్స్ రాకపోతే అది నా తప్పు కాదు.. భాగ్యశ్రీ వ్యాఖ్యలు వైరల్..
తాజాగా భాగ్యశ్రీ భోర్సే లెనిన్ సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Bhagyashri Borse)
Bhagyashri Borse
Bhagyashri Borse : మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ భోర్సే హిందీలో రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత కాంత, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఆ సినిమాలేవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. దీంతో భాగ్యశ్రీని ఐరన్ లెగ్ అని కూడా పలువురు కామెంట్స్ చేసారు. ఇటీవలే లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెనిన్ సినిమా హిట్ అవ్వడంతో సక్సెస్ మీట్ లో భాగ్యశ్రీ ఏడ్చేసింది కూడా.
తాజాగా భాగ్యశ్రీ భోర్సే లెనిన్ సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Kavitha : సినీ పరిశ్రమ పెద్దలపై కవిత సంచలన కామెంట్స్.. నేను అధికారంలోకి వస్తే..
భాగ్యశ్రీ భోర్సే మాట్లాడుతూ… సినిమా హిట్ ఫ్లాప్ విషయంలో నావి, మా అమ్మానాన్నల ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఓ నటిగా నా పాత్రకు న్యాయం చేయడమే నా సక్సెస్. కానీ బయట వాళ్లకు సక్సెస్ అంటే కలెక్షన్స్. నువ్వు సరిగ్గా నటించలేదు, ఆ సీన్ సరిగ్గా చేయలేదు, నీ నటన నచ్చలేదు అంటే నేను నటిగా ఫెయిల్ అయ్యానని ఒప్పుకుంటాను. అంతే కానీ బాక్సాఫీస్ నంబర్స్ సరిగ్గా రాలేదు ఇది నీ ఫెయిల్యూర్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్స్ ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు.
వరుసగా రెండు మూడు ఫ్లాప్స్ ఎదురవ్వగానే ఐరన్ లెగ్, అన్ లక్కీ అని అంటారు. నేను కూడా అలాంటి మాటలు విన్నాను. అలా నన్నే కాదు, ఏ హీరోయిన్ ని విమర్శించడం కరెక్ట్ కాదు. సినిమా ఎడిటింగ్ లో ఆఖరి నిర్ణయం మాది కాదు. కథలో ఫైనల్ నిర్ణయం మాది కాదు. స్టోరీ చివరకు మారుతుందా లేదా అనేది మాకు క్లారిటీ ఉండదు. ఇవన్నీ ప్రేక్షకుడికి తెలియాలి. ఒకవేళ ఎడిటింగ్ రూమ్ లో డైరెక్టర్, నిర్మాత, హీరోతో పాటు నేను కూడా ఉంటే అప్పుడు అలాంటి విమర్శలను తీసుకుంటాను అని తెలిపింది. దీంతో భాగ్యశ్రీ భోర్సేకు గత ఫ్లాప్ సినిమాల తాలూకు విమర్శలు గట్టిగానే బాధపెట్టాయని తెలుస్తుంది.
