అక్కినేని నాగచైతన్య, సమంత లు విడాకులు తీసుకోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున స్పందించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదన్నారు. తక్షణమే కొండా సురేఖ తన వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగార్జున ట్వీట్ చేశారు.
‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.’ అని నాగార్జున ఎక్స్‌లో రాసుకొచ్చారు.
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024
తనపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ట్రోలింగ్‌ను కేటీఆర్ సమర్థించినట్లుగా మాట్లాడడం పై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారన్నారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారని ఆరోపించారు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం అతడేనన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి వ్యక్తిగత విషయాలను తెలుసుకుని వాళ్లను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. కొంత మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆరే కారణం అని ఆరోపించారు. దుబాయ్‌లో మనుషులను పెట్టి పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.