Mr.Celebrity : మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్ చూశారా..? పరుచూరి బ్రదర్స్ మనవడు హీరోగా.. రానా చేతుల మీదుగా..
మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు.

Paruchuri Brother Grand Son First Movie Mr Celebrity Trailer Released
Mr.Celebrity : పరుచూరి బ్రదర్స్ మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతుంది. RP సినిమాస్ బ్యానర్ పై చిన్న రెడ్డయ్య, పాండు రంగారావు నిర్మాతలుగా రవి కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ అవ్వగా తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
Also Read : Pawan Kalyan : పవన్‌తో పాటు తిరుమలలో త్రివిక్రమ్, తమన్..
మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. ఓ అజ్ఞాత వ్యక్తి కొంతమందిని సెలబ్రిటీలను చేసి చంపుతాను అని బెదిరిస్తూ ఉంటాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రాబోతోంది అని తెలుస్తుంది. మీరు కూడా మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ లాంచ్ చేసిన రానా మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కాబోతుంది.