Pawan Kalyan : పవన్‌తో పాటు తిరుమలలో త్రివిక్రమ్, తమన్..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Pawan Kalyan Director Trivikram and Thaman at Tirumala
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట కుమారైలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సైతం తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో పవన్ కల్యాణ్‌ను కలుసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తమన్ సోషల్ మీడియాలో పవన్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు తిరుమలలో ఉన్నారు. ఆయన్ని నేను కలిశాను. ఇదో అద్భుతమైన క్షణం. నేను ఆయన్ను లీడర్ అని పిలుస్తాను. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం తమన్ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇక.. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు దీన్ని కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన.. అలిపిరి మెట్లమార్గం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు.
With Our Respected Deputy Chief Minister
The Way I call Him The #LEADER 🔥
Shri @PawanKalyan Gaaru at #Tirumala Today 💥@APDeputyCMO ✊❤️What a Mommmmmentttt !!! 🥹 HIGH 🔥 pic.twitter.com/HqtZZO41vP
— thaman S (@MusicThaman) October 2, 2024