Nagarjuna reveals Shobha Shetty three years secret love with Yashwanth
Shobha Shetty : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 గత సీజన్‌తో మెరుగా సాగుతూ ముందుకు వెళ్తుంది. ఈ సీజన్ అదిరిపోయే ట్విస్ట్ లు ఇస్తూ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూ వస్తున్నాడు బిగ్‌బాస్. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అంతా ప్రేక్షకులకు తెలిసిన వారే వచ్చారు. ఇక తెలుగు నెంబర్ వన్ సీరియల్ ‘కార్తీక దీపం’ సీరియల్ లో మోనితగా మంచి ఫేమ్ ని సంపాదించుకున్న శోభా శెట్టి.. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ లో బలమైన విలన్ గా ఒక ముద్ర వేసిన శోభా.. బిగ్‌బాస్ హౌస్ లో కూడా బలమైన కంటెస్టెంట్ గా మార్క్ వేస్తున్నారు.
కాగా గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ పర్సన్స్ లేదా ఇష్టమైన వ్యక్తులను బిగ్‌బాస్ ఇంటిలోకి తీసుకు వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా శోభా శెట్టి తండ్రిని, ఆమె లవర్ ని బిగ్‌బాస్ వేదిక మీదకి తీసుకు వచ్చారు. శోభా తన ప్రేమ విషయం ఎవరికి తెలియకుండా దాదాపు మూడున్నరయేళ్ళ నుంచి రహస్యంగా ఉంచుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రహస్య ప్రేమని నాగార్జున అందరి ముందు పెట్టేశారు. శోభా లవర్ ఎవరో మరెవరో కాదు అతడు కూడా ఒక సీరియల్ నటుడే. అతడు ఎవరు అని తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Also read : Tollywood Diwali : దివాళీకి టాలీవుడ్‌లో పేలిన టపాసులు ఇవే.. కొత్త సినిమా అప్డేట్స్ లిస్టు..
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడిగా కనిపించిన ఆదిత్య గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ అబ్బాయితో శుభ ప్రేమలో పడిందట. అతడి అసలు పేరు యశ్వంత్. పలు సీరియల్స్ లో నటించి తెలుగు వారి దగ్గర మంచి ఫేమ్ నే సంపాదించుకున్నారు. ఆ మధ్య వీరిద్దరూ కలిసి ఒక కవర్ సాంగ్ కూడా చేశారు. అయితే అప్పుడు మిత్రులు అనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు బిగ్‌బాస్ వేదిక పై లవర్స్ అంటూ కన్ఫార్మ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ గా మారాయి.