Tollywood Diwali : దివాళీకి టాలీవుడ్‌లో పేలిన టపాసులు ఇవే.. కొత్త సినిమా అప్డేట్స్ లిస్టు..

దివాళీ ఫెస్టివల్ సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ ఆడియన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

Tollywood Diwali : దివాళీకి టాలీవుడ్‌లో పేలిన టపాసులు ఇవే.. కొత్త సినిమా అప్డేట్స్ లిస్టు..

Tollywood heroes new movies updates on diwali occasion

Updated On : November 12, 2023 / 6:53 PM IST

Tollywood Diwali : దివాళీ ఫెస్టివల్ సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ ఆడియన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. ఎట్టకేలకు ఆటమ్ బాంబు లాంటి అప్డేట్ ఇచ్చారు. ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రభాస్ మాస్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పాటల విడుదలకు తేదీలు ఫిక్స్ చేసుకున్న వెంకటేష్ ‘సైంధవ్’, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాలు.

‘ఈగల్’ నుంచి రవితేజ, ‘భీమా’ నుంచి గోపీచంద్ అదిరిపోయే మాస్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ తో కలిసి టపాసులు కలుస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. ఇక ఓటీటీలో బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్‌స్టాఫుబుల్ కి ఈసారి బాలీవుడ్ నుంచి గెస్ట్ రాబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ వైపు కూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Ram Charan : RC16లో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. వేదిక పైనే ప్రకటించిన బుచ్చిబాబు..