Ram Charan : RC16లో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. వేదిక పైనే ప్రకటించిన బుచ్చిబాబు..

రామ్ చరణ్ యాంటిసిపేటడ్ మూవీ RC16లో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్. వేదిక పైనే ప్రకటించిన బుచ్చిబాబు.

Ram Charan : RC16లో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. వేదిక పైనే ప్రకటించిన బుచ్చిబాబు..

Biggboss Contestant Arjun Ambati In Ram Charan RC16 Movie

Updated On : November 12, 2023 / 4:52 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయనున్నారు. ఈ సినిమా పై కథ పై రామ్ చరణ్ చాలా ధీమా వ్యక్తం చేస్తూ వస్తుండడం, ఇటీవల బుచ్చిబాబు నేషనల్ అవార్డుని అందుకోవడం, ఈ ప్రాజెక్ట్ లోకి ఏ ఆర్ రెహమాన్ వంటి టెక్నీషియన్ అడుగుపెట్టడంతో.. అభిమానుల్లో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇంతటి యాంటిసిపేటడ్ మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అవకాశం అందుకున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబే స్వయంగా తెలియజేశారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షోకి బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ఇక అక్కడ హౌస్ లోని కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ.. కంటెస్టెంట్ అంబటి అర్జున్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. “రామ్ చరణ్ సినిమాలో నువ్వు కూడా ఒక పాత్ర చేస్తున్నావు” అని అంబటి చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. అంబటి టీవీ సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Also read : Bandla Ganesh : బండ్లన్న దివాళీ పిక్స్ వైరల్.. బండ్లన్న దివాళీని ఎప్పుడు నిరుత్సాహపరచడు..

ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. శంకర్ ఇండియన్ 2 షూటింగ్ కి షిఫ్ట్ అవ్వడంతో చరణ్ సినిమాకి బ్రేక్ లు పడ్డాయి. ఈ నెల 21 వరకు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లోనే ఉండనున్నాడట. 24వ తేదీ నుంచి గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇక ఈ దివాళీ పండక్కి ‘జరగండి’ సాంగ్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మేకర్స్.. ఒక సమస్య వల్ల రిలీజ్ వాయిదా వేసినట్లు ప్రకటిస్తూ చరణ్ అభిమానులను నిరుత్సాహపరిచారు. త్వరలోనే జరగండి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామని ప్రకటించారు.