Bandla Ganesh : బండ్లన్న దివాళీ పిక్స్ వైరల్.. బండ్లన్న దివాళీని ఎప్పుడు నిరుత్సాహపరచడు..
గత ఏడాదితో పోల్చుకుంటే బండ్ల గణేష్ టపాసుల సౌండ్ ఈ ఇయర్ ఇంకా గట్టిగా మోగబోతుందని అర్ధమవుతుంది. తాజా ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

Tollywood Producer actor Bandla Ganesh diwali bash photos
Bandla Ganesh : టాలీవుడ్ యాక్టర్, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ఆడియన్స్ కి సపరేట్ చెప్పనవసరం లేదు. సినిమాల్లో నటుడిగా కంటే పలు ఈవెంట్స్ వేదికల పై బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ లతో బాగా ఫేమస్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో కూడా వైరల్ ట్వీట్స్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతూ వస్తుంటారు. ఇక దివాళీ పండుగ సమయంలో బండ్ల గణేష్ వేసే ట్వీట్స్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.
క్రాకర్స్ షాప్‌ల్లో అమ్మే టపాసులు అన్ని బండ్ల గణేష్ ఇంటిలో దర్శనమిస్తాయి. తాను కొనుగోలు చేసిన టపాసులు అన్ని నెల పై అందంగా పరిచి వాటితో ఒక ఫోటో దిగి బండ్ల గణేష్ ప్రతి ఏడాది పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది బండ్లన్న ఎలాంటి దివాళీ బ్యాష్ ఇవ్వబోతున్నారో అని నెటిజెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా ఈ ఏడాది దివాళీ బ్యాష్ ఫోటోని కూడా బండ్ల గణేష్ షేర్ చేశారు.
Also read : Vijay Deverakonda : మృణాల్‌తో విజయ్ దేవరకొండ దివాళీ సెలబ్రేషన్స్ చూశారా..?
ఇక గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈ ఇయర్ టపాసుల సౌండ్ ఇంకా గట్టిగా మోగబోతుందని అర్ధమవుతుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. బయట క్రాకర్స్ షాప్ లో కూడా ఇన్ని టపాసులు లేవన్న, బండ్లన్న దివాళీని ఎప్పుడు నిరుత్సాహపరచాడు, ఈ మొత్తం క్రాకర్స్ కి ఎంత డబ్బు ఖర్చు చేశావు అన్న అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక కొందరు బండ్ల గణేష్ నటించిన ఒక సినిమాలోని కామెడీ సీన్ ని పోస్టు చేస్తూ వస్తున్నారు.
Test cheyandi swami pic.twitter.com/pjxBnnJagb
— tweetakudu (@tweetakudu) November 12, 2023