Nagarjuna Shows Serial Star Childhood Photo in Bigg Boss
Serial Actor : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతాయని తెలిసిందే. తాజాగా ఓ సీరియల్ హీరో చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది. బిగ్ బాస్ లో ఉన్న ఈ సీరియల్ స్టార్ చిన్నప్పటి ఫోటో నాగార్జున చూపించడంతో ఇది వైరల్ గా మారింది. ఇంతకీ ఈ క్యూట్ పిల్లాడు ఇప్పటి సీరియల్ స్టార్ ఎవరో అనుకున్నారా?
Also Read : Satyadev : తొమ్మిదో తరగతిలో ఆ హీరోయిన్ ముందు డ్యాన్స్ వేసా.. అదే స్టెప్పులు ఇప్పుడు చిరంజీవి ముందు..
ఈ క్యూట్ పిల్లాడు సీరియల్ హీరో నిఖిల్. కర్ణాటకకు చెందిన నిఖిల్ మళియక్కల్ ఇక్కడ తెలుగులో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి.. లాంటి పలు సీరియల్స్, పలు టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే నిఖిల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం టాప్ పొజిషన్ లోనే దూసుకుపోతున్నాడు. కప్పు కూడా ఇతనే గెలవచ్చేమో అంటున్నారు ప్రేక్షకులు.
అయితే ఇటీవల బిగ్ బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ జరగ్గా నాగార్జున నిఖిల్ చిన్నప్పటి ఫోటోని అందరికి చూపించాడు. కృష్ణుడి వేషంలో చిన్నప్పుడు నిఖిల్ క్యూట్ గా ఉన్నాడు. ఈ ఫొటో చూసిన వారంతా నిఖిల్ భలే క్యూట్ గా ఉన్నాడు అని అంటున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా అప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నావో అని కామెంట్స్ చేసారు.