‘మన్మథుడు 2’ కి రెడీ అయిన కింగ్ నాగార్జున

ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మన్మథుడు’. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ‘మన్మథుడు’ సినిమా వచ్చిందంటే టీవీలకు అతుక్కుపోయే వాళ్లున్నారు. అంత కామెడీ ఎంటర్‌టైనర్‌గా చరిత్ర సృష్టించింది ఈ చిత్రం.16 ఏళ్ల తర్వాత నాగ్ ‘మన్మథుడు 2’ చేస్తున్నారు. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోమవారం (మార్చి 24, 2019)న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కి జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను RX 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున సోదరి నాగ సుశీల, మేనల్లుడు, హీరో సుశాంత్ పాల్గొన్నారు. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు.