Meenaakshi Chaudhary
Meenaakshi Chaudhary : టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి ఒకరు. ఓ పక్క స్టార్ హీరోలతో చేస్తూనే మరో పక్క మిడ్ రేంజ్ హీరోలతో కూడా వరుస సినిమాలు చేస్తుంది. మీనాక్షి చౌదరికి సంక్రాంతి హీరోయిన్ అని పేరు వచ్చేసింది. 2024 లో సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. 2025 సంక్రాంతికి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు 2026 సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో వచ్చి హిట్ కొట్టింది.(Meenaakshi Chaudhary)
నేడు అనగనగా ఒక రాజు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మీనాక్షి చౌదరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Viva Harsha : భార్యతో కమెడియన్ వైవా హర్ష సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా..?
నాగవంశీ మాట్లాడుతూ.. మీనాక్షికి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజయింది. దాని తర్వాత ఈ సినిమాలో పెట్టినప్పట్నుంచి నవీన్ నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దు, సడెన్ గా డేట్స్ అడిగితే ఇబ్బంది అవుతుంది అని తనని ఆపి ఏ సినిమాలు చేయనివ్వలేదు. తనని ఏ సినిమాలు చేయనివ్వకుండా కచ్చితంగా సంక్రాతికి హిట్ ఇస్తాం నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏం సినిమాలు చేయకు, నీవి ఈ ఇయర్ ఏం సినిమాలు రిలీజ్ లేవని టెన్షన్ పడకు అని చెప్పాడు. 2025 లో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నాకు వన్ ఇయర్ ఒక్క సినిమా కూడా రిలీజ్ లేదు అని అడిగి నా బుర్ర తినేసేది మీనాక్షి. అందుకే మీనాక్షి కోసం అయినా ఈ సినిమా ఆడాలని కోరుకున్నాను అని అన్నారు.
స్టేజి మీదే మీనాక్షిని ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని నాగవంశీ అడగ్గా హ్యాపీనే అని చెప్పింది. ఒక సంవత్సరం ఆగినా సంక్రాంతికి వచ్చి ఇంకో హిట్ కొట్టి మరోసారి సంక్రాంతి హీరోయిన్ అనిపించుకుంది మీనాక్షి చౌదరి. ఇక మీనాక్షి ప్రస్తుతం నాగచైతన్యతో వృషకర్మ సినిమా చేస్తుంది.
Also Read : Sri Satya : ఆల్మోస్ట్ చనిపోయేదాన్ని.. టిప్పర్ లారీ గుద్దేసింది.. శ్రీ సత్య కామెంట్స్ వైరల్..