×
Ad

Nagavamsi : పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయింది.. తెలంగాణలో జీవో ఉంది.. ఆంధ్రాలో లేదు..

ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ టికెట్ రేట్ల గురించి మాట్లాడారు. (Nagavamsi)

Nagavamsi

Nagavamsi : వరుస సినిమాలు చేస్తున్న నిర్మాత నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్ నుంచి వరుసగా ఎంటరైన్మెంట్ సినిమాలు ఇస్తూ దూసుకుపోతున్నారు. త్వరలో సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి తో అనగనగా ఒకరాజు సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు.(Nagavamsi)

ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ టికెట్ రేట్ల గురించి మాట్లాడారు. ఇటీవల టికెట్ రేట్లు పెంచుతున్నారు అని పలువురు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు చిన్న సినిమాలకు పెట్టి వర్కౌట్ అవుతాయా లేదా అని ట్రై చేస్తున్నారు కొంతమంది నిర్మాతలు.

Also Read : Praneeth Pattipati : సినిమా హిట్ అయినా చూడటానికి థియేటర్స్ లేవు.. దానివల్లే సినిమా ఆలస్యం అయింది..

నాగవంశీ టికెట్ రేట్ల గురించి మాట్లాడుతూ.. కేవలం చిన్న సినిమాలకే 99 రూపాయలు పెట్టి చూసారు. అది అన్నిటికి వర్కౌట్ అవ్వదు. అది కూడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేసుకుంటారు. ఒక వస్తువు ఎక్కువ ఖర్చు పెట్టి తయారుచేస్తే ఎక్కువకే అమ్ముతారు. అలాగే మేము కేవలం పెద్ద సినిమాలకే పెంచుతున్నాము బడ్జెట్ పెరగడం వల్ల. తెలంగాణాలో మల్టీప్లెక్స్ లో 295 వరకు, సింగిల్ స్క్రీన్స్ లో 175 వరకు రేటు పెట్టుకోవచ్చు అనే జీవో ఉంది. కాబట్టి ఇక్కడ మేము పెంచమని అడగట్లేదు.

ఆంధ్రాలో అలా లేదు. అక్కడ సింగిల్ స్క్రీన్స్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 ఉన్నాయి. ప్రతిసారి మేము వెళ్లి 50 రూపాయలు, వంద రూపాయలు తెచ్చుకుంటే తెలంగాణ కంటే తక్కువ రేట్లే అయినా ప్రతి సినిమాకు మేము పెంచుతున్నాము అని నెగిటివ్ చేస్తున్నారు. అలా ప్రతిసారి రేటు పెరిగేలా జీవో తెచ్చుకోకుండా ఉండటానికి కళ్యాణ్ గారితో మేము చెప్పాము. మూడు రోజుల క్రితమే కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగింది. కళ్యాణ్ గారు ఒక టీమ్ ఫామ్ చేసారు. టికెట్ రేట్ల మీద వర్క్ చేస్తుంది ఆ టీమ్. త్వరలో ఏపీలో కూడా ఒక ఫిక్స్ రేట్ పెట్టి ఎక్కడివరకు, ఎంత పెట్టుకోవచ్చు అనేలా జీవో వస్తుంది అని తెలిపారు.

Also See : Rajasaab Working Stills : ప్రభాస్ ‘రాజాసాబ్’ వర్కింగ్ స్టిల్స్.. షేర్ చేసిన డైరెక్టర్ మారుతీ కూతురు..