×
Ad

War 2 : ఫైనల్ గా ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా.. నాగవంశీకి ఎన్ని కోట్ల నష్టం మిగిల్చింది..?

వార్ 2 సినిమాపై ఉన్న హైప్ తో నిర్మాత నాగవంశీ భారీ ధరకు ఇక్కడ తెలుగు రైట్స్ కొని రిలీజ్ చేసాడు. (War 2)

War 2

War 2 : ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బాలీవుడ్ యాక్షన్ స్పై సినిమాలో నటిస్తున్నాడని తెలుగులో కూడా ఈ సినిమాపై హైప్ నెలకొంది. కానీ ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది.(War 2)

అయితే వార్ 2 సినిమాపై ఉన్న హైప్ తో నిర్మాత నాగవంశీ భారీ ధరకు ఇక్కడ తెలుగు రైట్స్ కొని రిలీజ్ చేసాడు. కానీ తర్వాత నష్టాలు చూశారు. ఈ సినిమాను దాదాపు 80 నుంచి 90 కోట్లకు తెలుగు రైట్స్ కొన్నాడని సినిమా రిలీజ్ సమయంలో వార్తలు వచ్చాయి. వార్ 2 వచ్చి వెళ్ళాక నాగవంశీ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా ఫ్లాప్ అని, నష్టం వచ్చిందని మాట్లాడారు.

Also See : Radikaa Sarathkumar : వామ్మో.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎలా మారిపోయిందో చూడండి..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి నాగవంశీ వార్ 2 లెక్కల గురించి మాట్లాడాడు. నాగవంశీ చెప్పిన దాని ప్రకారం వార్ 2 తెలుగు రైట్స్ ని 68 కోట్లకు కొన్నాడట. GST లేకుండా. నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళే GST కట్టారు. ఈ లెక్కన సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 70 కోట్ల షర్ రావాలి. కానీ బాక్సాఫీస్ సమాచారం ప్రకారం వార్ 2 సినిమాకు దాదాపు 40 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో.

ఈ సినిమా నష్టం రావడంతో ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం యష్ రాజ్ ఫిలిమ్స్ 18 కోట్లు నష్టం కింద నాగవంశీకి ఇచ్చారట. నాగవంశీ లెక్కల పరికరం అన్ని పోగా దాదాపు 10 నుంచి 15 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. దీంతో వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ పది కోట్ల నష్టంతోనే ముగిసింది అని తెలుస్తుంది.

Also Read : Tasty Teja : ఎనిమిదేళ్లు ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు.. బాడీ షేమింగ్ చేసేవాళ్ళు..