Namrata arguing mahesh babu on that issue
Namrata : టాలీవుడ్ నటి మరియు మహేష్ బాబు భార్య నమ్రత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆశక్తి విషయాలను బయట పెట్టింది. సినిమాలోకి రాకముందు నమ్రత మోడలింగ్ రంగంలో ఉండేది. ఇండస్ట్రీలోకి వచ్చాక, ‘వంశీ’ సినిమాతో మహేష్-నమ్రతల మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకొని ఒకటి అయ్యారు ఈ జంట. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు.. గౌతమ్, సితార.
Mahesh Babu: సంక్రాంతి బరిలో మహేష్ సినిమా.. వారం ముందే ల్యాండ్ అవుతున్న బాబు!
అయితే పెళ్లి తరువాత కూడా నమ్రతకి సినిమాలో అవకాశాలు వచ్చినా.. నటించే ఉద్దేశం లేకపోవడంతో, కుటుంబ జీవితానికే పరిమితమైనట్లు తెలియజేసింది. కాగా మహేష్‌కి తనకి నిత్యం ఒక విషయంలో గొడవలు జరుగుతాయి అంటూ చెప్పిన నమ్రత.. అది ఏ విషయంలో అనేది తెలియజేసింది. “నేను నో చెబుతుంటానని, పిల్లలు ప్రతిదీ మహేష్‌నే అడుగుతుంటారు. అయన వాళ్ళు ఏది అడిగిన చేసేస్తుంటారు. అది నాకు నచ్చదు. అలా ఆ విషయంలో ఇద్దరం గొడవ పడుతుంటాము” అని తెలియజేసింది.
అలాగే మహేష్ బాబు సినిమాల్లో తనకి పోకిరి మూవీ అంటే చాలా ఇష్టమని, అందులోని పంచ్ డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తానని తెలియజేసింది. కాగా ఇటీవలే నమ్రత పేరు మీద బంజారాహిల్స్ లో ఒక రెస్టారెంట్ ని మొదలుపెట్టాడు మహేష్ బాబు. ఈ ఫుడ్ బిజినెస్ ని ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ప్రారంభించాడు. ఇటీవలే గ్రాండ్ గా ఓపెన్ కూడా అయ్యింది.