Namrata : మహేష్ తనయుడు ‘గౌతమ్‌’ సినిమా ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నమ్రతా.. ఆ తరువాతే హీరోగా..!

మహేష్ తనయుడు 'గౌతమ్‌' సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో అన్నది నమ్రతా అభిమానులకు తెలియజేసింది.

Namrata : మహేష్ తనయుడు ‘గౌతమ్‌’ సినిమా ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నమ్రతా.. ఆ తరువాతే హీరోగా..!

Namrata comments on mahesh babu son Gautham Krishna

Updated On : July 16, 2023 / 9:45 AM IST

Namrata – Mahesh Babu : సూప‌ర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మ‌హేశ్ బాబు.. ఇప్పుడు స్టార్ హీరోగా టాప్ పొజిషన్ ని అందుకున్నాడు. హీరోగానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా టాప్ లో నిలిచాడు. ఇప్పుడు తండ్రి బాటలోనే మహేష్ గారాలపట్టి సితార (Sitara) కూడా పయనిస్తుంది. అయితే సినిమాలో ఎంట్రీ కంటే ముందు ప్ర‌ముఖ జ్యువ‌ల‌రీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం అందుకుంది. ఇటీవలే ఆ జ్యువ‌ల‌రీ యాడ్‌ని అమెరికాలోని ప్ర‌సిద్ద టైమ్స్ స్క్వేర్ (New York Time Square) బిల్‌బోర్డ్‌పై ముందుగా ప్రదర్శించారు.

Nithya Menen : నిత్యామీనన్ ఇంట విషాదం.. మరో లోకంలో మిమ్మల్ని కలుసుకుంటా అంటూ పోస్ట్..

తాజాగా ఆ జ్యువ‌ల‌రీ సంస్థకు చెందిన ఒక ప్రెస్ మీట్‌ నిర్వహించగా నమ్రతా అండ్ సితార పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విలేకర్లు.. ‘సితారని బ్రాండ్ మోడల్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక అభిమానులు గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందని అడుగుతున్నారు’ అంటూ ప్రశ్నించారు. దీనికి నమ్రతా బదులిస్తూ.. ”గౌతమ్‌కి ఇంకా 16 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం తను గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలనే ఆసక్తితో ఉన్నాడు. ప్రెజెంట్ చదువుకోవడంలో బిజీగా ఉన్నాడు కాబట్టి తన ఎంట్రీకి మరో ఏడెనిమిదేళ్లు పట్టొచ్చు” అంటూ చెప్పుకొచ్చింది.

Kajol – Shah Rukh Khan : ‘పఠాన్’ సినిమావి ఫేక్ కలెక్షన్స్ అంటున్న హీరోయిన్ కాజోల్..

కాగా గౌతమ్ ఆల్రెడీ మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మహేష్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Karam) సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. శ్రీలీల (Sreeleela) ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు.