Namrata reaction on Mahesh Babu Trekking photos with germany doctor
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఒంటరిగా జెర్మనీకి వెళ్లిన సంగతి తెలిసిందే. గత పదిరోజుల నుంచి మహేష్ బాబు అక్కడే ఉంటున్నారు. అక్కడ ఒక డాక్టర్‌ని కలుసుకోవడం కోసం మహేష్ బాబు వెళ్లారు. ఆ డాక్టర్ బాడీ ఫిట్‌నెస్ పై సూచనలు ఇస్తూ ఉంటారని.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే అర్ధమవుతుంది. గత రెండేళ్లుగా మహేష్ ఆయన దగ్గర ట్రైన్ అవుతూ వస్తున్నారు.
ఈక్రమంలోనే 2023 ఏప్రిల్, 2022 జూన్‌లో కూడా మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకున్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి పండగ పూర్తి చేసుకొని అక్కడికి వెళ్లిన మహేష్ బాబు.. అక్కడ డాక్టర్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేశారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు, డాక్టర్‌తో కలిసి ట్రెక్కింగ్ వెళ్లారు.
Also read : Tollywood : డ్రగ్స్‌తో పట్టుబడిన టాలీవుడ్ హీరో ప్రేయసి.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..
ఇక ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫోటోలను చూసిన నమ్రత.. ‘మిస్ యూ’ అంటూ లవ్ ఎమోజిస్ తో ఎమోషనల్ గా కామెంట్ చేశారు. నమ్రత చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి జర్మనీ అడవుల్లో మహేష్ బాబు ట్రెక్కింగ్ ని మీరు కూడా చూసేయండి.
కాగా మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళితో తీస్తున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిపోయింది. ఉగాదికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కథ అంతా అమెజాన్ అడవుల నేపథ్యంతో అడ్వెంచర్ గా సాగబోతోంది. దీంతో అప్పుడు యాక్టింగ్ కోసమే మహేష్ బాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.