Tollywood : డ్రగ్స్‌తో పట్టుబడిన టాలీవుడ్ హీరో ప్రేయసి.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..
ఓ టాలీవుడ్ హీరో ప్రేయసి.. డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ కోకపెట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న..

Tollywood hero lover is arrested by police due to consuming of narcotics
Tollywood : టాలీవుడ్ లో డ్రగ్స్ ఉపయోగం పై రెండు మూడు నెలలకు ఓ వార్త బయటకి వస్తూనే ఉంది. ఈ విషయంలో పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నా.. మళ్ళీ కొత్త పేరులు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరో ప్రేయసి.. డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడింది. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం వర్గాల్లో మరోసారి సంచలనంగా మారింది. అసలు ఏమైంది..? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..?
హైదరాబాద్ కోకపెట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఓ యువతి డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు పక్క ప్లాన్ తో ఆ యువతి ఇంటిపై దాడి జరిపారు. ఈ దాడిలో పోలీసులకు 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. ఈ డ్రగ్స్ ని గోవా నుండి యునిత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా యువతి అందుకున్నట్లు తెలియజేసిందట.
Also read : Koratala Siva : ఏడేళ్లుగా ‘శ్రీమంతుడు’ రచ్చ.. సుప్రీంకోర్టులో కూడా కొరటాల శివకు చుక్కెదురు..
ఆ యువతి కంజ్యుమ్ చేసేందుకే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ డ్రగ్స్ గోవా నుంచి ఎలా హైదరాబాద్ కి వచ్చాయి, ఈ డ్రగ్స్ తరలింపు వెనుక ఉన్న చైన్ లింక్ ఏంటనేది పోలీసులు విచారిస్తున్నారు. ఈక్రమంలోనే ఆ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, టాబ్ ఫోన్ సీజ్ చేసి పరిశీలిస్తున్నారు. ఈ విచారణలోనే పట్టుబడిన యువతి టాలీవుడ్ లోని ఓ హీరో ప్రేయసిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దీంతో టాలీవుడ్ లో ఆ యువతికి ఇంకెవరెవరితో సంబంధాలు ఉన్నాయో అనే కోణంలో కూడా విచారణ మొదలు పెట్టారు. అలాగే రేవ్ పార్టీలు కూడా నిర్వహించినట్లు చెబుతున్నారు. దీంతో ఎక్కడెక్కడ ఆ ఈవెంట్స్ చేసారు.. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక పట్టుబడిన యువతి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆమెను రిమాండ్ కి తరలించారు.