మహర్షి విడుదల సందర్భంగా నమ్రత పోస్ట్

మహర్షి సినిమా విడుదలవుతున్న సందర్భంగా మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది..

  • Publish Date - May 9, 2019 / 07:23 AM IST

మహర్షి సినిమా విడుదలవుతున్న సందర్భంగా మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి మూవీ మే 9న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. సినిమా విడుదలవుతున్న సందర్భంగా మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. ‘టు డే బిగ్ డే, మహర్షి ద్వారా ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన సినిమాని ఇవ్వడానికి నువ్వెంత కష్టపడ్డావో నేను కళ్లారా చూసాను.. ఇప్పుడు ప్రపంచమంతా ఆ కష్టాన్ని చూడబోతుంది.

రిషి క్యారెక్టర్‌ని నేను ఇష్టపడినట్టే ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను.. గుడ్ లక్ మై లవ్.. మహేష్’.. అంటూ నమ్రత పోస్ట్ చేసింది. తన పోస్ట్‌కి పెట్టిన ఫోటో కూడా చాలా బాగుంది.. మహేష్ ముఖం కనబడకుండా నమ్రతని గట్టిగా హగ్ చేసుకున్నాడు ఆ పిక్‌లో.. ఈ పిక్ చూసి,  మహేష్, నమ్రత వెనక చిన్నపిల్లాడిలా దాక్కున్నాడు.. అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు.