Balakrishna: మా అమ్మా, నాన్నలతో ఆయనకు మాత్రమే చనువు ఉండేది -నందమూరి బాలకృష్ణ

ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నందమూరి బాలకృష్ణ, ఓ షోతో త్వరలో రాబోతున్నారు.

Balakrishna: మా అమ్మా, నాన్నలతో ఆయనకు మాత్రమే చనువు ఉండేది -నందమూరి బాలకృష్ణ

Bala Krishna (1)

Updated On : October 14, 2021 / 7:11 PM IST

Balakrishna: ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నందమూరి బాలకృష్ణ, ఓ షోతో త్వరలో రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ షోకి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్యగారికి మాత్రమే అమ్మానాన్నల దగ్గర చనువు ఉండేదని, ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మా ఇంట్లో వాళ్లతో ఎవరికీ లేదని అన్నారు బాలకృష్ణ.

మా అమ్మ దగ్గరికి వచ్చి బండోడితో ఏమైనా చెప్పాలా? అని అల్లూ రామలింగయ్య అనేవారని, వంట గదిలోకి నేరుగా వెళ్లి టీ పెట్టించుకుని తాగే చనువు ఆయనకు ఉండేదని, బండోడి(ఎన్టీఆర్)కి ఏమైనా చెప్పాలా? అని అడిగేవారని, నువ్వు ఒక అగ్నిపర్వతం లాంటి దానివి అన్నీ లోపల దాచుకుంటావు అని అనేవారని చెప్పారు బాలయ్య.

ఇక దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో సహా ప్రతీ ఒక్కరూ షో కోసం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. మనుషులుగా మనమంతా ఒకటేనని, బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి ఆవిష్కరణ జరుగుతుందని అన్నారు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే ‘అన్‌స్టాపపబుల్‌’ అన్నారు. నా గురించి ఓ తెరిచిన పుస్తకం.. క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా అయితేనేం, హిందూపుర్ ఎమ్మెల్యేగా అయితేనేం, సినిమా హీరోగా అయితేనేం చేయగలిగినవరకు చేస్తున్నాను. అని అన్నారు.