Balakrishna Bently Car
Nandamuri Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ ద్వారా ఫస్ట్ టైం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య టాక్ షో చెయ్యబోతున్నారనే న్యూస్ గతకొద్ది రోజులుగా మీడియా అండ్ సోషల్ మీడియాలో వివపరీతంగా వైరల్ అవుతోంది.
Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..
‘ఆహా’ లో నటసింహంతో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే షో చెయ్యబోతున్నట్లు లాంఛ్ ఈవెంట్‌లో స్నీక్ పీక్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు ‘ఆహా’ టీం. బాలయ్యను సరికొత్త గెటప్‌లో చూపిస్తూ.. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అంటూ డిఫరెంట్‌గా చేస్తున్న ప్రమోషన్స్‌కి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
Unstoppable with NBK : షో లోనూ ‘సింహా’న్ని చూస్తారు..
ఇక ఈ ఈవెంట్‌లో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. లగ్జీరియస్ బెంట్లీ కార్‌లో రాయల్ ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఆ కార్ గురించే నెట్టింట టాపిక్ నడుస్తోందిప్పుడు. ఈ కార్‌ని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా పెద్ద కుమార్తె బ్రహ్మణి ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కార్ రేటు 4 నుంచి 4.5 కోట్ల వరకు ఉంటుందట. ఇటీవల ఎక్కువగా కుమార్తె ఇచ్చిన ఆ కారులోనే షికార్లు చేస్తున్నారు బాలయ్య.
కార్ దిగి ఇది యన్‌బికె ట్రేడ్ మార్క్ అంటూ గాగుల్స్ ఎగరేసి క్యాచ్ పట్టడం.. స్టేజ్ మీద స్టెప్పులెయ్యడం.. స్పీచ్ కూడా క్లుప్తంగా ముగించడం.. ఇలా బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ నవంబర్ 4 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ షో లో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి.
Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో